7-234-వ.
ఇట్లు దనకుఁ బరిచర్య జేయుచున్న దైత్యరాజకుటుంబినికి
నాశ్రితరక్షావిశారదుం డైన నారదుండు నిజసామర్థ్యంబున నభయం బిచ్చి గర్భస్థుండ నైన
నన్ను నుద్దేశించి ధర్మతత్త్వంబును నిర్మలజ్ఞానంబును నుపదేశించిన, నమ్ముద్ధియ దద్ధయుం బెద్దకాలంబునాఁటి వినికి గావున నాడుది యగుటం జేసి
పరిపాటి దప్పి సూటి లేక మఱచె; నారదుఁడు నా యెడఁ గృప గల
నిమిత్తంబున.
టీకా:
ఇట్లు =
ఇలా; తన = తన; కున్ = కు; పరిచర్య =
సేవ; చేయుచున్న = చేస్తున్న; దైత్య =
రాక్షస; రాజ = రాజు యొక్క; కుటుంబిని =
భార్య; కిన్ = కి; ఆశ్రిత =
ఆశ్రయించినవారిని; రక్షా = కాపాడుటయందు; విశారదుండు = మిక్కిలినేర్పుగలవాడు; ఐన = అయిన;
నారదుండు = నారదుడు; నిజ = స్వంత; సామర్థ్యంబునన్ = శక్తిచేత; అభయంబున్ = అభయమును;
ఇచ్చి = ఇచ్చి; గర్భస్థుండన్ =
కడుపులోనున్నవాడను; ఐన = అయిన; నన్నున్
= నన్ను; ఉద్దేశించి = గురించి; ధర్మ =
ధర్మముయొక్క; తత్త్వంబును = స్వరూపమును; నిర్మల = రాగాదికలుషితముగాని; జ్ఞానంబును = జ్ఞానమును;
ఉపదేశించినన్ = బోధింపగా; ఆ = ఆ; ముద్దియ = స్త్రీ; దద్దయున్ = మిక్కలి; పెద్ద = ఎక్కువ; కాలంబున్ = కాలము; నాటి = పూర్వపు; వినికి =
విన్నసంగతి; కావునన్ = కనుక; ఆడుది =
ఆడమనిషి; అగుటన్ = అగుట; చేసి = వలన;
పరిపాటిన్ = అభ్యాసము; తప్పి = తప్పి; సూటి = గుర్తు; లేక = లేకుండ; మఱచెన్
= మరచిపోయెను; నారదుడు = నారదుడు; నా =
నా; ఎడన్ = అందు; కృప = దయ; కల = ఉండుట; నిమిత్తంబునన్ = వలన.
భావము:
ఆశ్రిత జన రక్షకుడు అయిన నారదుడు, మా అమ్మ
చేస్తున్న సేవను ఎంతో మెచ్చుకున్నాడు. తన శక్తికొలది కడుపులో పెట్టుకొని కాపాడాడు.
నా యందు మిక్కిలి దయగలవాడు కనుక నాకు చెప్పవలెను అనే తలపుతో, మా తల్లికి స్వచ్ఛమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని
ఉపదేశించాడు. కానీ స్త్రీ కావటం వలన, చాలా కాలం గడిచిపోవడం
వలన, అభ్యాసం లేకపోవడం వలన మా అమ్మ ఇప్పుడు అవన్నీ
మరచిపోయింది.
७-२३४-व.
इट्लु दनकुँ बरिचर्य जेयुचुन्न
दैत्यराजकुटुंबिनिकि नाश्रितरक्षाविशारदुं डैन नारदुंडु निजसामर्थ्यंबुन नभयं
बिच्चि गर्भस्थुंड नैन नन्नु नुद्देशिंचि धर्मतत्त्वंबुनु निर्मलज्ञानंबुनु
नुपदेशिंचिन, नम्मुद्धिय दद्धयुं बेद्दकालंबुनाँटि विनिकि गावुन नाडुदि
यगुटं जेसि परिपाटि दप्पि सूटि लेक मर्रचे; नारदुँडु ना येडँ गृप गल निमित्तंबुन.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment