7-236-ఆ.
వినుఁడు నాదు పలుకు విశ్వసించితిరేని
సతుల కయిన బాల జనుల కయినఁ
దెలియ వచ్చు మేలు దేహాద్యహంకార
దళననిపుణ మైన తపసిమతము."
టీకా:
వినుడు =
వినండి; నాదు = నా యొక్క; పలుకు = మాట; విశ్వసించితిరేని = నమ్మినచో; సతుల్ = స్త్రీల;
కున్ = కు; అయిన = ఐన; బాల
= పిల్ల; జనుల్ = వారి; కిన్ = కి;
అయిన = ఐన; తెలియన్ = తెలియను; వచ్చున్ = అగును; మేలు = మంచిది, శ్రేయము; దేహ = దేహము; ఆది =
మొదలగు; అహంకార = మమత్వమును; దళన =
పోగొట్టునది; ఐన = అయిన; తపసి = ఋషిచే;
మతము = తెలుపబడినది.
భావము:
శ్రద్దగా
వినండి చెప్తాను. నా మాట నమ్మండి. నారద మహర్షి తత్వం తెలుసుకోడానికి స్త్రీలు, బాలలు కూడ అర్హులే. ఈ నారద భక్తి తత్వం తెలుసుకుంటే దేహాభిమానాలు, మమకారాలు తొలగిపోతాయి. ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది.”
७-२३६-आ.
विनुँडु नादु पलुकु विश्वसिंचितिरेनि
सतुल कयिन बाल जनुल कयिनँ
देलिय वच्चु मेलु देहाद्यहंकार
दळननिपुण मैन तपसिमतमु."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment