Monday, January 18, 2016

ప్రహ్లాదుని జన్మంబు - వెల్లిగొని నాఁట

7-235-క.
వెల్లిగొని నాఁటనుండియు
నుల్లసితం బైన దైవయోగంబున శో
భిల్లెడు మునిమత మంతయు
నుల్లంబున మఱపు పుట్ట దొకనాఁ డైనన్.
టీకా:
          వెల్లిగొని = బయటకొచ్చిన; నాటి = దినము; నుండియున్ = నుండి; ఉల్లసితంబు = వికసించినది; ఐన = అయిన; దైవ = అదృష్ట; యోగంబునన్ = సంయోగమువలన; శోభిల్లెడున్ = ప్రకాశించుచున్నది; ముని = ఋషి యొక్క; మతము = తత్త్వార్థము; అంతయున్ = సమస్తమును; ఉల్లంబునన్ = మనసులో; మఱపు = మరచిపోవుట; పుట్టదు = కలుగదు; ఒకనాడు = ఒకమాటు; ఐనన్ = అయినను.
భావము:
            నారదమహర్షికి నా మీద ఉన్న దయవలన, దైవయోగం కలిసిరావటంవలన, నాకు మాత్రం వారు ఆ ఉపదేశాలు అన్నీ నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరోజు కూడ ఒక్కటి కూడ నేను మర్చిపోలేదు. చక్కగా అన్నీ గుర్తున్నాయి.
७-२३५-क.
वेल्लिगोनि नाँटनुंडियु
नुल्लसितं बैन दैवयगंबुन शो
भिल्लेडु मुनिमत मंतयु
नुल्लंबुन मर्रपु पुट्ट दोकनाँ डैनन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: