Friday, January 15, 2016

ప్రహ్లాదుని జన్మంబు - స్వర్భువనాధినాథ

7-226-వ.
ఇట్లు సురేంద్రుండు మా తల్లిం జెఱగొని పోవుచుండ న మ్ముగుద కురరి యను పులుఁగు క్రియ మొఱలిడినఁ దెరువున దైవయోగంబున నారదుండు పొడఁగని యిట్లనియె.
7-227-ఉ.
"స్వర్భువనాధినాథ! సురత్తమ! వేల్పులలోన మిక్కలిన్
నిర్భరపుణ్యమూర్తివి సునీతివి మానినిఁ బట్ట నేల? యీ
ర్భిణి నాతురన్ విడువు ల్మషమానసురాలు గాదు నీ
దుర్భరరోషమున్ నిలుపు దుర్జయుఁ డైన నిలింపవైరి పై."
టీకా:
          ఇట్లు = ఈ విధముగ; సురేంద్రుండు = దేవేంద్రుడు; మా = మా యొక్క; తల్లిన్ = తల్లిని; చెఱన్ = బంధీగా; కొనిపోవుచుండన్ = తీసుకొనిపోవుచుండగా; ఆ = ఆ; ముగుద = ముగ్ద; కురరి = ఆడులకుముకి; అను = అనెడి; పులుగు = పిట్ట; క్రియన్ = వలె; మొఱలిడినన్ = ఆర్తద్వానములు చేయుచుండ; తెరువునన్ = దారిలో; దైవ = దేవుని; యోగంబున = వశముచేత; నారదుండు = నారదుడు; పొడగని = కనుగొని, చూచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          స్వర్భువనాధినాథ = ఇంద్ర {స్వర్భువనాధినాథుడు - స్వర్భువన (స్వర్గలోకపు) అధినాథుడు (ప్రభువు), ఇంద్రుడు}; సురసత్తమ = ఇంద్ర {సురసత్తముడు - సుర (దేవలలో) సత్తముడు (సామర్థ్యముగలవాడు), ఇంద్రుడు}; వేల్పులు = దేవతల; లోనన్ = అందు; మిక్కిలి = అధికమైన; నిర్భర = భరింపరాని; పుణ్య = పుణ్యముగల; మూర్తివి = స్వరూపముగలవాడవు; సునీతివి = మంచినీతిమంతుడవు; మానినిన్ = స్త్రీని; పట్టన్ = బంధిచుట; ఏల = ఎందుకు; ఈ = ఈ; గర్భిణిన్ = గర్భవతిని; ఆతురన్ = శోకముచెందినామెను; విడువు = వదలిపెట్టు; కల్మష = చెడు; మానసురాలు = మనసుగలామె; కాదు = కాదు; నీ = నీ యొక్క; దుర్భర = భరింరరాని; రోషమున్ = క్రోధమును; నిలుపు = ఆపుకొనుము; దుర్జయుడు = జయింపరానివాడు; ఐన = అయిన; నిలింపవైరి = రాక్షసుని {నిలింవైరి - నిలింప (దేవతా) వైరి (శత్రువు), రాక్షసుడు}; పై = మీద.
భావము:
            ఇలా మా తల్లిని చెరబట్టి ఇంద్రుడు తీసుకుపోతుంటే ఆమె ఆడు లకుముకిపిట్ట లాగ రోదించింది. అదృష్టవశాత్తు దైవయోగం కలిసి వచ్చి దారిలో నారదమహర్షి ఇదంతా చూశాడు. అప్పుడు నారదమహర్షి ఇంద్రుడితో ఇలా అన్నాడు.
             “ఓ దేవేంద్రా! నువ్వేమో దేవతలలో శ్రేష్ఠుడివి; పుణ్యమూర్తివి; నీతిమంతుడవు; స్వర్గ లోకానికే అధిపతివి; ఇలా నువ్వు పర స్త్రీని పట్టుకుని రావటం తప్పు కదా; ఈమె పాపాత్మురాలు కాదు; పైగా ఈమె గర్భవతి; నీ కోపం ఏం ఉన్నా హిరణ్యకశిపుడి మీద చూపించు. అంతేకాని ఈమె పై కాదు. వెంటనే భయార్తురాలు అయిన ఈమెను విడిచిపెట్టు.”
७-२२६-व.
इट्लु सुरेंद्रुंडु मा तल्लिं जेर्रगोनि पोवुचुंड न म्मुगुद कुररि यनु पुलुँगु क्रिय मोर्रलिडिनँ देरुवुन दैवयोगंबुन नारदुंडु पोडँगनि यिट्लनिये.
७-२२७-उ.
"स्वर्भुवनाधिनाथ! सुरसत्तम! वेल्पुललोन मिक्कलिन्
निर्भरपुण्यमूर्तिवि सुनीतिवि मानिनिँ बट्ट नेल? यी
गर्भिणि नातुरन् विडुवु कल्मषमानसुरालु गादु नी
दुर्भररोषमुन् निलुपु दुर्जयुँ डैन निलिंपवैरि पै."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: