Wednesday, January 13, 2016

ప్రహ్లాదుని జన్మంబు - అంతనిధాన మైన

7-228-వ.
అనిన వేల్పుఁదపసికి వేయిగన్నులు గల గఱువ యిట్లనియె.
7-229-ఉ.
"అంనిధాన మైన దితిజాధిపువీర్యము దీని కుక్షి న
త్యం సమృద్ధి నొందెడి మహాత్మక! కావునఁ దత్ప్రసూతి ప
ర్యంము బద్ధఁ జేసి జనితార్భకు వజ్రము ధారఁ ద్రుంచి ని
శ్చింతుఁడనై తుదిన్ విడుతు సిద్ధము దానవరాజవల్లభన్."
టీకా:
          అనినన్ = అనగా; వేల్పుదపసి = దేనఋషి; కిన్ = కి; వేయిగన్నులుగలగఱువ = ఇంద్రుడు {వేయిగన్నులుగలగఱువ - వేయి (వెయ్యి, 1000) కన్నులుగల గఱువ (ఘనుడు), ఇంద్రుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          అంత = నాశనమునకు; నిధానము = కారణమైవవాడు; ఐన = అయిన; దితిజాధిపు = రాక్షసరాజు యొక్క; వీర్యము = రేతస్సు; దీని = ఈమె యొక్క; కుక్షిన్ = కడుపులో; సమృద్ధిన్ = మిగులవృద్ధిని; ఒందెడిన్ = పొందుచున్నది; మహాత్మక = గొప్పఆత్మకలవాడ; కావునన్ = అందుచేత; తత్ = ఆ; ప్రసూతి = పురుటి; పర్యంతమున్ = వరకు; బద్దన్ = బంధీని; చేసి = చేసి; జనిత = పుట్టిన; అర్భకున్ = పిల్లవానిని; వజ్రము = వజ్రాయుధము; ధారన్ = పదునుతో; త్రుంచి = నరికి; నిశ్చింతుడను = దిగులులేనివాడను; ఐ = అయ్యి; తుదిన్ = చివరకు; విడుతున్ = విడిచిపెట్టెదను; సిద్ధము = నిశ్చయముగ; దానవ = రాక్షస; రాజ = రాజు యొక్క; వల్లభన్ = భార్యను.
భావము:
            దేవర్షి నారదులవారు ఇలా చెప్పగా వేయి కన్నులున్న దేవర ఇలా అన్నాడు.
            ఓ మహాత్ముడా! లోకాలకు దుస్సహమైన హిరణ్యకశిపుని రాక్షస వీర్యం ఈమె కడుపులో వృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఈమె ప్రసవించే వరకు బందీగా ఉంచి, పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో సంహరిస్తాను. అప్పుడు నా మనస్సు నిశ్చింతగా ఉంటుంది. ఈ రాక్షసరాజు పత్నిని తప్పక విడిచిపెట్టేస్తాను.”
७-२२८-व.
अनिन वेल्पुँदपसिकि वेयिगन्नुलु गल गर्रुव यिट्लनिये.
७-२२९-उ.
"अंतनिधान मैन दितिजाधिपुवीर्यमु दीनि कुक्षि न
त्यंत समृद्धि नोंदेडि महात्मक! कावुनँ दत्प्रसूति प
र्यंतमु बद्धँ जेसि जनितार्भकु वज्रमु धारँ द्रुंचि नि
श्चिंतुँडनै तुदिन् विडुतु सिद्धमु दानवराजवल्लभन्."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: