7-242-క.
దానవ
దైత్య భుజంగమ
మానవ
గంధర్వ సుర సమాజములో ల
క్ష్మీనాథు
చరణకమల
ధ్యానంబున
నెవ్వఁడయిన ధన్యత
నొందున్.
టీకా:
దానవ = దానవులు; దైత్య = దితిజులు; భుజంగమ
= నాగులు; మానవ = మానవులు; గంధర్వ =
గంధర్వులు; సుర = దేవతలయొక్క; సమాజము =
సమూహముల; లోన్ = అందు; లక్ష్మీనాథు =
నారాయణుని {లక్ష్మీనాథడు - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు}; చరణ = పాదములనెడి; కమల
= పద్మముల; ధ్యానంబునన్ = చింతనముచేత; ఎవ్వడు
= ఎవడు; అయినన్ = అయినను; ధన్యతన్ = కృతార్థత్వంబును;
ఒందున్ = పొందును.
భావము:
శ్రీహరి
పాదపద్మాలను సేవిస్తే చాలు, దానవులు, దైత్యులు, సర్పరాజులు,
మానవులు, గంధర్వులు, దేవతలు
ఎవరైనా సరే, పుణ్యాత్ములు అవుతారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment