7-233-శా.
యోషారత్నము
నాథదైవత విశాలోద్యోగ మా తల్లి ని
ర్వైషమ్యంబున
నాథురాక మదిలో వాంఛించి
నిర్దోష యై
యీషద్భీతియు
లేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శు
శ్రూషల్ చేయుచు
నుండె నారదునకున్ సువ్యక్త
శీలంబునన్.
టీకా:

భావము:
మహిళారత్నము, మహా
పతివ్రతా, సుసంకల్ప అయిన మా అమ్మ లీలావతి, ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోకుండా, భర్తనే దైవంగా భావిస్తూ,
అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. తన కడుపులో పెరుగుతున్న కుమారుని
క్షేమం కోరుకుంటూ, నారదమహర్షికి సేవలు చేస్తూ, ఏ బెదురు లేకుండా, మేలైన నడతతో ఆశ్రమంలో
ఉండిపోయింది.
७-२३३-शा.
योषारत्नमु नाथदैवत विशालोद्योग मा तल्लि नि
र्वैषम्यंबुन नाथुराक मदिलो वांछिंचि निर्दोष
यै
यीषद्भीतियु लेक गर्भपरिरक्षेच्छन् विचारिंचि
शु
श्रूषल् चेयुचु नुंडे नारदुनकुन् सुव्यक्त
शीलंबुनन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment