7-245-ఆ.
దనుజ భుజగ యక్ష దైత్య
మృగాభీర
సుందరీ విహంగ శూద్ర
శబరు
లైనఁ బాపజీవు లైన
ముక్తికిఁ బోదు
రఖిల జగము విష్ణుఁ డనుచుఁ దలఁచి.
టీకా:
దనుజ = రాక్షసులు; భుజగ = సర్పములు; యక్ష
= యక్షులు; దైత్య రాక్షసులు; మృగ
జంతువులు; ఆభీర ఆభీరదేశపు; సుందరీ
స్త్రీలు; విహంగ పక్షులు; శూద్ర =
శూద్రులు; శబర = శబరులు, ఎఱుకలు;
ఐన = అయిన; పాప = పాపములుచేసినవారైను; జీవులు ప్రాణులు; ఐన అయినను; ముక్తి
= పరమపదమున; కిన్ = కి; పోదురు =
వెళ్ళెదరు; అఖిల = సమస్తమైన; జగమున్ =
విశ్వము; విష్ణుడు = విష్ణుమూర్తి; అనుచున్
= అనుచు; తలచి = భావించి.
భావము:
దనుజులు,
రాక్షసులు, నాగులు, యక్షులు, దైత్యులు, జంతువులు, గొల్లలు, స్త్రీలు, శూద్రులు, శబరులు,
ఇంకా ఏ జాతి వారైనా సరే,ఏ పాపజీవనులు అయినా సరే “సర్వం
విష్ణుమయం జగత్” అని మనసారా
తలచినట్లైతే చాలు, ముక్తిని పొందుతారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment