7-216-ఆ.
విషయసక్తులైన విబుధాహితుల తోడి
మనికి వలదు ముక్తిమార్గవాంఛ
నాదిదేవు విష్ణు నాశ్రయింపుఁడు ముక్త
సంగజనులఁ గూడి శైశవమున.
టీకా:
విషయ
= ఇంద్రియార్థములందు; సక్తులు = తగులములుగలవారు; ఐన = అయిన; విబుధాహితుల = రాక్షసుల {విబుధాహితులు - విబుధ (దేవతలకు)
అహితులు (శత్రువులు), రాక్షసులు}; తోడి = తోటి; మనికి = జీవితము; వలదు = వద్దు; ముక్తి = మోక్షమునుచేరెడి; మార్గ = పద్ధతి; వాంఛన్ = కోరికతో; ఆదిదేవున్ = మూలకారణమైనదేవుని; విష్ణున్ = నారాయణుని; ఆశ్రయింపుడు = ఆశ్రయించండి; ముక్త = వదలబడిన; సంగ = తగులములుకలిగిన; జనులన్ = వారని; కూడి = చేరి; శైశవమునన్ = చిన్నతనముననే.
భావము:
కాబట్టి, కోరికలలో కూరుకు పోయే జ్ఞానులకు నచ్చని వారైన ఈ రాక్షస గురువులు మన క్షేమం
కోరే వారు కాదు. వారితో
స్నేహం మనకి వద్దు. ఈ చిన్న వయసులోనే మోక్షమార్గం కోరుకోండి. దానికోసం ముక్తి మార్గంలో పయనించే మంచి వారితో స్నేహం చేస్తూ, ఆది దేవుడు అయిన విష్ణుమూర్తిని
ఆశ్రయించండి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment