Thursday, January 21, 2016

ప్రహ్లాదుని జన్మంబు - సంసార మిది

7-238-సీ.
సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ
ణబద్ధ మజ్ఞానకారణంబుఁ
లవంటి దింతియ కాని నిక్కము గాదు
ర్వార్థములు మనస్సంభవములు 
స్వప్న జాగరములు మములు గుణశూన్యుఁ
గు పరమునికి, గుణాశ్రయమున
వవినాశంబులు వాటిల్లి నట్లుండుఁ
ట్టి చూచిన లేవు బాలులార!
7-238.1-తే.
డఁగి త్రిగుణాత్మకము లైన ర్మములకు
నకమై వచ్చు నజ్ఞాన ముదయమును
నతర జ్ఞానవహ్నిచేఁ గాల్చి పుచ్చి
ర్మవిరహితు లై హరిఁ నుట మేలు.
టీకా:
          సంసారము = సంసారము; ఇది = ఇది; బుద్ధి = బుద్ధిచేత; సాధ్యము = సాధింపదగినది; గుణ = త్రిగుణమూలములైన; కర్మ = కర్మములచేత; బద్ధము = కల్పింపబడినది; అజ్ఞాన = అవిద్యకి; కారణంబున్ = హేతువైనది; కల = స్వప్నము; వంటిది = వంటిది; అంతియె = అంతే; కాని = కాని; నిక్కము = నిజమైనది; కాదు = కాదు; సర్వ = సమస్తమైన; అర్థములున్ = విషయములు; మనస్ = మనస్సులో; సంభవములు = పుట్టినవి; స్వప్న = కల; జాగరములు = మెలకువలు; సమములు = సమానమైనవి; గుణ = గుణములు; శూన్యుడు = లేనివాడు; అగు = అయిన; పరమున్ = సర్వాతీతుని; కిన్ = కి; గుణాశ్రయమునన్ = సత్వాదులసంగముచేత; భవ = పుట్టుట; నాశంబులు = మరణములు; వాటిల్లిన = కలిగిన; అట్లు = విధముగ; ఉండున్ = అనిపించును; పట్టి = విచారించి; చూచినన్ = చూసిన; లేవు = లేవు; బాలులార = బాలలూ, అజ్ఞానులారా. 
          కడగి = ప్రయత్నించి, పూనికతో; త్రిగుణ = సత్వరజస్తమోగుణముల; అత్మకములు = స్వరూపములు; ఐన = అయిన; కర్మముల్ = కర్మల; కున్ = కు; జనకము = జన్మకారణము; ఐ = అయ్యి; వచ్చున్ = కలిగెడి; అజ్ఞాన = అవిద్య యొక్క; సముదయమునున్ = సమూహమును; ఘనతర = అతిగొప్ప {ఘనము - ఘనతరము - ఘనతమము}; జ్ఞాన = జ్ఞానము యనెడి; వహ్ని = అగ్ని; చేన్ = చేత; కాల్చిపుచ్చి = కాల్చేసి; కర్మవిరహితులు = కర్మబంధములులేనివారు; ఐ = అయ్యి; హరిన్ = నారాయణుని; కనుట = తెలియుట, చూచుట; మేలు = ఉత్తమము.
భావము:
            పిల్లలు! ఈ సంసారం కేవలం బుద్ధి వలననే ఏర్పడుతుంది. ఇది సత్త్వ రజస్తమో గుణాత్మకాలు అయిన కర్మలలో బందీ అయి ఉంటుంది; ఈ సంసారం అన్నది కేవలం స్వప్నం లాంటిది. ఎంతమాత్రం యదార్థం కాదు. సకల కాంక్షలు మనస్సులోనే పుడతాయి. స్వప్నం, మెలకువ ఈ రెండింటికి తేడాయే లేదు. పరమాత్మ గుణాలకు అతీతుడు అయినా, గుణాలను ఆశ్రయించి ఆయన కూడ జననం, మరణం పొందుతున్నట్లు అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాలు వలన ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నితో కాల్చివేయాలి. అలా నిస్వార్థమైన మనస్సుతో విష్ణుమూర్తిని కనుగొనటం మంచిది.
७-२३८-सी.
संसार मिदि बुद्धिसाध्यमु गुणकर्म;
गणबद्ध मज्ञानकारणंबुँ
गलवंटि दिंतिय कानि निक्कमु गादु;
सर्वार्थमुलु मनस्संभवमुलु
स्वप्न जागरमुलु सममुलु गुणशून्युँ;
डगु परमुनिकि, गुणाश्रयमुन
भवविनाशंबुलु वाटिल्लि नट्लुंडुँ;
बट्टि चूचिन लवु बालुलार!
७-२३८.१-त.
कडँगि त्रिगुणात्मकमु लैन कर्ममुलकु
जनकमै वच्चु नज्ञान समुदयमुनु
घनतर ज्ञानवह्निचेँ गाल्चि पुच्चि
कर्मविरहितु लै हरिँ गनुट मेलु.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: