Sunday, January 10, 2016

ప్రహ్లాదుని జన్మంబు - అక్షీణోగ్ర తపంబు

7-223-శా.
"క్షీణోగ్ర తపంబు మందరముపై ర్థించి మా తండ్రి శు
ద్ధక్షాంతిం జని యుండఁ జీమగమిచేతన్ భోగి చందంబునన్
క్షింపంబడెఁ బూర్వపాపములచేఁ బాపాత్మకుం డంచు మున్
క్షస్సంఘముమీఁద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై.
టీకా:
          అక్షీణ = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; తపంబున్ = తపస్సును; మందరము = మందర పర్వతము; పై = మీద; అర్థించి = కోరి; మా = మా యొక్క; తండ్రి = తండ్రి; శుద్ధ = పరమ; క్షాంతిని = శాంతితో; చని = వెళ్ళి; ఉండన్ = ఉండగా; చీమ = చీమల; గమి = బారు; చేతన్ = వలన; భోగి = పాము; చందంబునన్ = వలె; భక్షింపన్ = తినబడెను, నశించెను; పూర్వ = పూర్వజన్మలసంపాదించుకొన్న; పాపముల = పాపముల; చేన్ = వలన; పాపాత్మకుండు = పాపస్వరూపి; అంచున్ = అనుచు; మున్ = ఇంతకు పూర్వము; రక్షస్ = రాక్షసుల; సంఘమున్ = సమూహము; మీదన్ = పైన; నిర్జరుల్ = దేవతలు; సంరంభించి = ఉత్సాహించి; యుద్ధ = యుద్ధమును; అర్థులు = చేయగోరువారు; ఐ = అయ్యి.
భావము:                                                
            “పూర్వం మా తండ్రి ఘోరమైన తపస్సు చేయటానికి మందరపర్వతము మీదికి ప్రశాంత చిత్తంతో వెళ్ళాడు. చాలాకాలం రాకుండా అక్కడే ఉన్నాడు. దేవత లందఱు “ఇక హిరణ్యకశిపుడు చీమల బారిన పడిన పాము లాగ తన పాపాలచే తానే నాశనమయ్యాడు. ఇంక రాక్షసులు అందరిని చంపేద్దాం” అని అందరు కలిసి యుద్ధానికి సంసిద్ధులు అయి బయలుదేరారు.
-२२३-शा.
"अक्षीणग्र तपंबु मंदरमुपै नर्थिंचि मा तंड्रि शु
द्धक्षांतिं जनि युंडँ जीमगमिचतन् भगि चंदंबुनन्
भक्षिंपंबडेँ बूर्वपापमुलचँ बापात्मकुं डंचु मुन्
रक्षस्संघमुमीँद निर्जरुलु संरंभिंचि युद्धार्थुलै.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: