7-244-క.
చాలదు
భూదేవత్వము
చాలదు
దేవత్వ మధిక శాంతత్వంబుం
జాలదు హరి
మెప్పింప వి
శాలోద్యములార!
భక్తి చాలిన
భంగిన్.
టీకా:
చాలదు = సరిపడదు; భూదేవత్వమున్ = బ్రాహ్మణత్వము;
చాలదు = సరిపడదు; దేవత్వము = దేవత్వము;
అధిక = మిక్కిలి; శాంతత్వంబున్ = సాధుస్వభావము;
చాలదు = సరిపోదు; హరిన్ = నారాయణుని; మెప్పింపన్ = మెచ్చునట్లు చేయుటకు; విశాల = గొప్ప;
ఉద్యములారా = యత్నముకలవారలారా; భక్తి = భక్తి;
చాలిన = సరిపడిన; భంగిని = విధముగ.
భావము:
మంచి శ్రద్ధ
గల బాలకులారా! విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు, బ్రాహ్మణత్వం సరిపోదు,
దైవత్వం సరిపోదు, గొప్ప శాంత స్వభావమూ చాలదు.
విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం,
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment