Sunday, November 15, 2015

ప్రహ్లాద చరిత్ర - ఎల్ల శరీరధారులకు

7-141-వచనము
అని మఱియుఁ "బుత్రా నీ కెయ్యది భద్రంబై యున్నది; చెప్పు" మనినఁ గన్నతండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె.
7-142-ఉత్పలమాల
ల్ల శరీరధారులకు నిల్లను చీఁకటినూతిలోపలం
ద్రెళ్ళ మీరు నే మను తిభ్రమణంబున భిన్ను లై ప్రవ
ర్తిల్ల సర్వమున్నతని దివ్యకళామయ మంచు విష్ణునం
దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!
            ఇలా అని పిమ్మట హిరణ్యాక్షుడు కుమారా! గురువులు చెప్పిన వాటిలో నీకు బాగా నచ్చిన వాటిలో బాగా వచ్చినది చెప్పు.అన్నాడు. తండ్రి హిరణ్యకశిపుడి మాటలు వినిన చిన్నారి కొడుకు ఇలా అన్నాడు. ఓ రాక్షసేశ్వరా! లోకులు అందరు అజ్ఞానంతో, ఇల్లనే చీకటిగోతిలో పడి తల్లడిల్లుతూ ఉంటారు; నేను వేరు, మీరు వేరు అనే చిత్త భ్రమ భేద భావంతో ఉంటారు. అట్టి భేద భావంతో మెలగకుండా; విశ్వం అంతా విష్ణు దేవుని లీలా విశేషాలతో నిండి ఉంది అని గ్రహించాలి; అలా గ్రహించి ఆ విష్ణుదేవుని మనసులో నిలుపుకొని, తాము అడవులలో నివసించినా ఉత్తమమే.
                        అని = అని; మఱియున్ = ఇంకను; నీ = నీ; కున్ = కు; ఎయ్యది = ఏది; భద్రంబు = చక్కగావచ్చి, శుభమై; ఉన్నది = ఉన్నది; చెప్పుము = చెప్పుము; అనినన్ = అనగా; కన్న = జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రియనందనుడు = ఇష్టసుతుడు; ఇట్లు = విధముగ; అనియె = పలికెను;
            ఎల్ల = సర్వ; శరీరధారుల్ = మానవుల {శరీరధారులు - దేహము ధరించినవారు, మానవులు}; కున్ = కు; ఇల్లు = నివాసము; అను = అనెడి; చీకటి = చీకటి; నూతి = నుయ్యికి; లోపలన్ = లోపలందు; త్రెళ్ళక = పడకుండగ; మీరున్ = మీరు; ఏమున్ = మేము; అను = అనెడి; మతిన్ = చిత్త; భ్రమణంబునన్ = వైకల్యముతో; భిన్నులు = భేదభావముగలవారు; = అయ్యి; ప్రవర్తిల్లక = తిరుగకుండగ; సర్వమున్ = అఖిలము; అతని = అతని యొక్క; దివ్య = అతిగొప్ప; కళా = అంశతో, మాయావిలాసముతో; మయము = నిండినది; అంచున్ = అనుచు; విష్ణున్ = నారాయణుని; అందున్ = అందు; ఉల్లమున్ = హృదయము; చేర్చి = చేర్చి; తారు = తాము; అడవిన్ = అడవిలో; ఉండుట = ఉండుట; మేలు = ఉత్తమము; నిశాచర = రాక్షసులలో; అగ్రణీ = గొప్పవాడ.
७-१४१-वचनमु
अनि मर्रियुँ "बुत्रा नी केय्यदि भद्रंबै युन्नदि; चेप्पु" मनिनँ गन्नतंड्रिकिँ ब्रियनंदनुं डिट्लनिये.
७-१४२-उत्पलमाल
एल्ल शरीरधारुलकु निल्लनु चीँकटिनूतिलपलं
द्रेळ्ळक मीरु ने मनु मतिभ्रमणंबुन भिन्नु लै प्रव
र्तिल्लक सर्वमुन्नतनि दिव्यकळामय मंचु विष्णुनं
दुल्लमुँ जेर्चि ता रडवि नुंडुट मेलु निशाचराग्रणी!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

2 comments:

Anonymous said...

Dhanyavadhaalu, tq so much for this

Telugu Heroes said...

Excellent