Saturday, November 14, 2015

ప్రహ్లాద చరిత్ర - ఉత్సాహ

7-139-శార్దూల విక్రీడితము
త్సాహప్రభుమంత్రశక్తియుతమే యుద్యోగ? మారూఢ సం
విత్సంపన్నుఁడ వైతివే? చదివితే వేదంబులున్ శాస్త్రముల్?
త్సా రమ్మని చేరఁ జీరి కొడుకున్ వాత్సల్యసంపూర్ణుఁ డై
యుత్సంగాగ్రముఁ జేర్చి దానవవిభుం డుత్కంఠ దీపింపగన్.
7-140-కంద పద్యము
నుదిన సంతోషణములు,
నితశ్రమతాపదుఃఖ సంశోషణముల్,
యుల సంభాషణములు,
కులకుం గర్ణయుగళ ద్భూషణముల్.
            హిరణ్యకశిపుడికి పుత్ర వాత్సల్యంతో ఉత్సాహం వెల్లివిరిసింది. నాయనా! రావోయీ అని చేరదీసి తొడపై కూర్చోబెట్టుకుని నాయనా! నీవు చేసే కృషి క్షాత్ర శక్తి సామర్థ్యాలతో కూడినదే కదా? బాగా చదువుకొని జ్ఞానము సంపాదించావా? వేదాలు, శాస్త్రాలు పూర్తిగా చదివావా?
            కొడకుల ముద్దుమాటలు తండ్రులకు ఎప్పడూ ఆనందాన్ని కలిగిస్తాయి. ఎంతటి అలసట, తాపం, దుఃఖం కలిగినా తొలగిస్తాయి. కొడుకుల పలుకులు తండ్రి రెండు చెవులకు చక్కటి పండుగులు. అని అన్నాడు
            ఉత్సాహ = పూనిక; ప్రభుమంత్ర = రాజకీయ జ్ఞాన; శక్తి = బలములతో; యుతమే = కూడినదియేకదా; ఉద్యోగము = పూనిక; ఆరూఢ = పొందిన; సంవిత్ = తెలివి యనెడి; సంపన్నుండవు = సంపదగలవాడవు; ఐతివే = అయితివా; చదివితే = చదువుకొంటివా; వేదంబుల్ = వేదములను; శాస్త్రముల్ = శాస్త్రములను; వత్సా = పుత్రుడా; రమ్ము = రా; అని = అని; చేరన్ = వద్దకు; చీరి = పిలిచి; కొడుకున్ = పుత్రుని; వాత్సల్య = ప్రేమతో; సంపూర్ణుడు = నిండినవాడు; = అయ్యి; ఉత్సంగాగ్రమున్ = ఒడిలోకి, తొడమీదకు; చేర్చి = తీసుకొని; దానవవిభుండు = హిరణ్యకశిపుడు {దానవవిభుడు - దానవ (రాక్షస) విభుడు (రాజు), హిరణ్యకశిపుడు}; ఉత్కంఠ = ఆసక్తి; దీపింపగన్ = విలసిల్లగా.
            అనుదిన = ప్రతిదిన; సంతోషణములు = సంతోషముగలిగించెడివి; జనిత = కలిగిన; శ్రమ = శ్రమను; తాప = బాధను; దుఃఖ = శోకమును; శోషణముల్ = ఆవిరిచేయునవి; తనయుల = పుత్రుల; సంభాషణములున్ = మాటలు; జనకుల్ = తండ్రుల; కున్ = కు; కర్ణు = చెవుల; యుగళ = జంటకు; సత్ = మంచి; భూషణముల్ = అలంకారములు.
७-१३९-शार्दूल विक्रीडितमु
उत्साहप्रभुमंत्रशक्तियुतमे युद्योग? मारूढ सं
वित्संपन्नुँड वैतिवे? चदिविते वेदंबुलुन् शास्त्रमुल्?
वत्सा रम्मनि चेरँ जीरि कोडुकुन् वात्सल्यसंपूर्णुँ डै
युत्संगाग्रमुँ जेर्चि दानवविभुं डुत्कंठ दीपिंपगन्.
७-१४०-कंद पद्यमु
अनुदिन संतोषणमुलु,
जनितश्रमतापदुःख संशोषणमुल्,
तनयुल संभाषणमुलु,
जनकुलकुं गर्णयुगळ सद्भूषणमुल्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: