Wednesday, November 25, 2015

ప్రహ్లాద చరిత్ర - భార్గవనందను

7-156-కంద పద్యము
భార్గవనందనుఁ డతనికి
మార్గము చెడకుండఁ బెక్కు మాఱులు నిచ్చల్
ర్గత్రితయము చెప్పె
ర్గ మగు మతివిశేషమర నరేంద్రా!
7-157-వచనము
మఱియు గురుండు శిష్యునకు సామదానభేదదండోపాయంబు లన్నియు నెఱింగించి నీతికోవిదుండయ్యె నని నమ్మి నిశ్చయించి తల్లికి నెఱింగించి తల్లిచేత నలంకృతుం డయిన కులదీపకు నవలోకించి.
            ధర్మరాజా! అలా శుక్రాచార్యుడి కొడుకు ఆ గురువు తన చాతుర్యం అంతా చూపి, ప్రహ్లాదుడికి వాళ్ళ సంప్రదాయం ప్రకారం అనేక విద్యలు ఏకాంతంగా చెప్పారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామ శాస్త్రం అనే త్రితయాలను ఎడ తెగకుండా బోధించాడు. అనర్గళమైన తెలివితేటలు అమరేలా ఆయా విషయాలను అనేక సార్లు వల్లింప జేశాడు. అంతే కాకుండా, చండామార్కులు శిష్యుడు ప్రహ్లాదుడికి ఉపాయాలు నాలుగు రకాలు అంటే మంచిమాటలతో మచ్చిక చేసుకోడమనే సామం, కొన్ని వస్తువులు ఇచ్చి మంచి చేసుకోడం దానం, కలహాలు పెట్టి బెదిరించి సానుకూలం చేసుకోడం అనే బేధం అన్నీ చెప్పారు. ఈ సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించే సమయాలూ విధానాలు బాగా వివరించి చెప్పారు. మంచి నీతిమంతుడు అయ్యాడు అనుకున్నారు. అదే అతని తల్లికి చెప్పారు. ఆమె చాలా సంతోషించి వంశవర్ధనుడు అయిన కొడుకును చక్కగా అలంకరించి తండ్రి వద్దకు వెళ్ళమంది. అప్పుడు గురువు శిష్యుడితో ఇలా అన్నారు.
          వయో పరిపక్వత వచ్చేకా త్రైవర్గములైన ధర్మం, అర్థం, కామం చెప్తారు. రాచకార్యాల నిర్వహణ స్థాయికి వచ్చేకా చతురోపాయాలైన సామం, దానం, భేదం, దండన చెప్తారు. కాని అయిదేండ్ల వాడైన ప్రహ్లాదుడికి దారికి తెచ్చుకోడానికి చెప్పారుట.  
          భార్గవనంనుండు = శుక్రుని కొడుకు; అతని = అతని; కిన్ = కి; మార్గము = దారి; చెడకుండగ = తప్పిపోకుండగ; పెక్కు = అనేక; మాఱులు = పర్యాయములు; నిచ్చల్ = ఎల్లప్పుడు; వర్గత్రితయమున్ = ధర్మార్థకామములను; చెప్పన్ = చెప్పిను; అనర్గళము = అడ్డులేనిది; అగు = అయిన; మతి = బుద్ధి; విశేష = విశిష్టత; అమరన్ = ఒప్పునట్లు; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నర( మానవులకు) ఇంద్రుడు (ప్రభువు), రాజు}.
           మఱియున్ = ఇంకను; గురుండు = గురువు; శిష్యున్ = శిష్యుని; కున్ = కి; సామ = సామము; దాన = దానము; భేద = భేదము; దండ = దండము యనెడి; ఉపాయంబులన్ = ఉపాయములను; అన్నియున్ = సమస్తమును; ఎఱింగించి = తెలిపి; నీతి = రాజనీతిశాస్త్రమునందు; కోవిదుండు = ప్రవీణుడు; అయ్యెన్ = అయ్యెను; అని = అని; నమ్మి = నమ్మి; నిశ్చయించి = నిర్ణయించి; తల్లి = తల్లి; కిన్ = కి; ఎఱింగించి = తెలిపి; తల్లి = తల్లి; చేతన్ = వలన; అలంకృతుండు = అలంకరింపబడినవాడు; అయిన = ఐన; కులదీపకున్ = ప్రహ్లాదుని {కులదీపకుడు - కుల (వంశమును) దీపకుండు (ప్రకాశింపజేయువాడు), ప్రహ్లాదుడు}; అవలోకించి = చూసి.
७-१५६-कंद पद्यमु
भार्गवनंदनुँ डतनिकि
मार्गमु चेडकुंडँ बेक्कु मार्रुलु निच्चल्
वर्गत्रितयमु चेप्पे न
नर्गळ मगु मतिविशेषममर नरेंद्रा!
७-१५७-वचनमु
मर्रियु गुरुंडु शिष्युनकु सामदानभेददंडोपायंबु लन्नियु नेर्रिंगिंचि नीतिकोविदुंडय्ये ननि नम्मि निश्चयिंचि तल्लिकि नेर्रिंगिंचि तल्लिचेत नलंकृतुं डयिन कुलदीपकु नवलोकिंचि.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: