Thursday, November 19, 2015

ప్రహ్లాద చరిత్ర - అజ్ఞుల్ కొందఱు

7-147-వచనము
అనినఁ దండ్రిమాటలకుఁ బురోహితు నిరీక్షంచి ప్రహ్లాదుం డిట్లనియె "మోహనిర్మూలనంబుజేసి యెవ్వనియందుఁ దత్పరులయిన యెఱుకగల పురుషులకుం బరులు దా మనియెడు మాయాకృతం బయిన యసద్గ్రాహ్యంబగు భేదంబు గానంబడ దట్టి పరమేశ్వరునకు నమస్కరించెద.
7-148-శార్దూల విక్రీడితము
జ్ఞుల్ కొందఱు నేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమణునిన్ భాషింపఁగా నేర రా
జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే
జ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ ర్శింపఁగా నేర్తురే?
              ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు ఛండామార్కులను చూసి ఇలా అన్నాడు జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని అందు ఏకాగ్ర భక్తి ప్రపత్తులతో ఉంటారు. అట్టి వారికి తమ పర భేదం అనే మాయా మోహం అంటదు. ఆ భగవంతుడు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.
            కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు, పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు. సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలూ, పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞాన మూర్తులు కూడా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు!
            అనినన్ = అనగా; తండ్రి = తండ్రియొక్క; మాటలు = పలుకుల; కున్ = కు; పురోహితుని = గురువును; నిరీక్షించి = ఉద్ధేశించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = విధముగ; అనియె = పలికెను; మోహ = మోహమును; నిర్మూలనంబున్ = పూర్తిగాపోగొట్టబడినదిగా; చేసి = చేసి; ఎవ్వని = ఎవని; అందున్ = ఎడల; తత్పరులు = తగిలియుండువారు; అయిన = ఐన; ఎఱుక = తెలివి; కల = కలిగినదా లేక; పురుషుల్ = మానవుల; కున్ = కు; పరులు = ఇతరులు; తాము = తాము; అనియెడు = అనెడి; మాయా = మాయచేత; కృతంబు = కలిగించబడినది; అయిన = ఐన; అసత్ = అసత్తుచేత, మిథ్యాగా; గ్రాహ్యంబు = తెలియునది; అగు = అయిన; భేదంబు = భేదభావము; కానంబడదు = కనబడదు; అట్టి = అటువంటి; పరమేశ్వరున్ = నారయణుని {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నత మైన) ఈశ్వరుడు, విష్ణువు}; కున్ = కి; నమస్కరించెద = నమస్కారముచేసెదను.
            అజ్ఞుల్ = జ్ఞానములేనివారు; కొందఱు = కొంతమంది; నేము = మేము; తాము = వారు; అనుచున్ = అనుచు; మాయన్ = మోహమును; చెంది = పొంది; సర్వాత్మకున్ = నారాయణుని {సర్వాత్మకుడు సర్వము తానైనవాడు, విష్ణువు}; ప్రజ్ఞాలభ్యున్ = నారాయణుని {ప్రజ్ఞాలభ్యుడు - బుద్ధిబలముచేత అందని వాడు, విష్ణువు}; దురన్వయక్రమణునిన్ = నారాయణుని {దురన్వయక్రమణుడు - అన్వయ (ఘటింప) రాని (శక్యముగాని) క్రమణుడు (ప్రవర్తన గలవాడు), విష్ణువు}; భాషింపగాన్ = పలుకుటను; నేరరు = చేయలేరు; = ; జిజ్ఞాసా = తెలిసికొనెడి; పథము = విధానము; అందున్ = లో; మూఢులు = మూర్ఖులు; కదా = కదా; చింతింపన్ = భావించుట; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగువారు; వేదజ్ఞులు = వేదముతెలిసినవారు; తత్ = అట్టి; పరమాత్మున్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; ఇతరుల్ = ఇతరులు; దర్శింపగాన్ = దర్శించుటను; నేర్తురే = చేయగలరా ఏమి.
७-१४७-वचनमु
अनिनँ दंड्रिमाटलकुँ बुरोहितु निरीक्षंचि प्रह्लादुं डिट्लनिये "मोहनिर्मूलनंबुजेसि येव्वनियंदुँ दत्परुलयिन येर्रुकगल पुरुषुलकुं बरुलु दा मनियेडु मायाकृतं बयिन यसद्ग्राह्यंबगु भेदंबु गानंबड दट्टि परमेश्वरुनकु नमस्करिंचेद.
७-१४८-शार्दूल विक्रीडितमु
अज्ञुल् कोंदर्रु नेमु दा मनुचु मायं जेंदि सर्वात्मकुं
ब्रज्ञालभ्यु दुरन्वयक्रमणुनिन् भाषिंपँगा नेर रा
जिज्ञासापथमंदु मूढुलु गदा चिंतिंप ब्रह्मादि वे
दज्ञुल् तत्परमात्मु विष्णु नितरुल् दर्शिंपँगा नर्तुरे?
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: