Tuesday, November 3, 2015

ప్రహ్లాద చరిత్ర - పానీయంబులు

7-123-శార్దూల విక్రీడితము
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు చేయుచుం దిరుగుచున్ క్షించుచున్ సంతత
శ్రీనారాయణపాదపద్మయుగళీచింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే ద్విశ్వమున్ భూవరా!
            రాజా! ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్ళు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎపుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీ హరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి, ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు.
          పానీయంబులున్ = పానీయములను {పానీయము - పానము (తాగుట)కు అనుకూలమైన ద్రవపదార్థములు}; త్రావుచున్ = తాగుతూ; కుడుచుచున్ = తినుచు (ఆహారాదులు); భాషించుచు = మాటలాడుచు; హాస = సంతోషించుట; లీల = ఆటలాడుట; నిద్ర = నిద్రించుట; ఆదులు = మొదలగువానిని; చేయుచున్ = చేస్తూ; తిరుగుచున్ = తిరుగుతూ; లక్షించున్ = గురిపెట్టి; సంతత = ఎడతెగని; శ్రీనారాయణు = శ్రీహరి యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; యుగళీ = జంటను; చింతన = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; ఆస్వాదన్ = ఆస్వాదించుటయందు; సంధానుండు = లగ్నమైనవాడు; = అయ్యి; మఱచెన్ = మరచిపోయెను; సురారితనయుడు = ప్రహ్లాదుడు {సురారితనయుడు - సురారి (రాక్షసు, హిరణ్యకశిపు)ని తనయుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; ఏతద్విశ్వమున్ = బాహ్యప్రపంచమును; భూవరా = రాజా {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}.
७-१२३-शार्दूल विक्रीडितमु
पानीयंबुलु द्रावुचुं गुडुचुचुन् भाषिंचुचुन् हासली
लानिद्रादुलु चेयुचुं दिरुगुचुन् लक्षिंचुचुन् संतत
श्रीनारायणपादपद्मयुगळीचिंतामृतास्वाद सं
धानुंडै मर्रचेन् सुरारिसुतुँ डे तद्विश्वमुन् भूवरा!  
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: