7-153-చంపకమాల
తనయుఁడు గాఁడు శాత్రవుఁడు దానవభర్తకు వీఁడు దైత్య చం
దనవనమందుఁ గంటకయుతక్షితిజాతము భంగిఁ బుట్టినాఁ
డనవరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి చేయుచుండు, దం
డనమునఁ గాని శిక్షలకు డాయఁడు పట్టుఁడు కొట్టుఁ డుద్ధతిన్.
హిరణ్యకశిప మహారాజుకు శత్రవు తప్పించి వీడు కొడుకు కాడు. నిర్మలమైన
రాక్షస కులం అను గంధపు తోటలో ఈ దుర్మాత్ముడు ముళ్ళ చెట్టులా పుట్టాడు. ఎప్పుడూ
రాక్షస కులాన్ని నాశనం చేస్తున్న విష్ణువును నుతిస్తాడు. వీడిని కఠినంగా దండిస్తే
గాని చదువుల దారికి రాడు. పట్టుకొని గట్టిగా కొట్టండి.” అని గురువు చండామార్కులు హిరణ్యాక్షుడితో మళ్ళీ ఇలా అన్నారు.
తనయుడు = పుత్రుడు; కాడు = కాడు; శాత్రవుడు = విరోధి; దానవభర్త = హిరణ్యకశిపుని; కున్ = కి; వీడు = ఇతడు; దైత్య = రాక్షస (వంశము) యనెడి; చందన = గంధపుచెట్ల; వనము = అడవి; అందున్ = లో; కంటక = ముళ్లుతో; యుత = కూడిన; క్షితిజాతము = చెట్టు {క్షితిజాతము - క్షితి (నేల)లో జాతము (పుట్టినది), చెట్టు}; భంగిన్ = వలె; పుట్టినాడు = జన్మించెను; అనవరతంబున్ = ఎల్లప్పుడు; రాక్షసకులాంతకున్ = నారాయణుని {రాక్షసకులాంతకుడు - రాక్షస కుల (వంశమును) అంతకుడు (నాశనముచేయువాడు), విష్ణువు}; ప్రస్తుతిన్ = మిక్కిలి కీర్తించుటను; చేయుచుండున్ = చేయుచుండును; దండనమునన్ = కొట్టుటవలన; కాని = తప్పించి; శిక్షల్ = చదువుచెప్పు పద్ధతుల; కున్ = కు; డాయడు = చేరడు; పట్టుడు = పట్టుకొనండి; కొట్టుడు = కొట్టండి; ఉద్ధతిన్ = మిక్కిలిగా.
७-१५३-चंपकमाल
तनयुँडु गाँडु शात्रवुँडु दानवभर्तकु वीँडु दैत्य चं
दनवनमंदुँ गंटकयुतक्षितिजातमु भंगिँ बुट्टिनाँ
डनवरतंबु राक्षसकुलांतकुँ ब्रस्तुति चेयुचुंडु, दं
डनमुनँ गानि शिक्षलकु डायँडु पट्टुँडु कोट्टुँ डुद्धतिन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment