7-134-ఉత్పలమాల
అంచితభక్తితోడ దనుజాధిపు గేహసమీపముం బ్రవే
శించి సురారిరాజసుతుఁ జేకొని శుక్రకుమారకుల్ పఠిం
పించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రము లా కుమారుఁ డా
లించి పఠించె నన్నియుఁ జలింపని వైష్ణవభక్తిపూర్ణుఁడై.

అంచిత = చక్కటి; భక్తి = భక్తి; తోడన్ = తోటి; దనుజాధిపు = హిరణ్యకశిపుని {దనుజాధిపుడు - దనుజు (రాక్షసు)లకు అధిపుడు (రాజు), హిరణ్యకశిపుడు}; గేహ = ఇంటి; సమీపమున్ = వద్దకు; ప్రవేశించి = చేరి; సురారిరాజసుతున్ = ప్రహ్లాదుని {సురారిరాజసుతుడు - సురారి (రాక్షసరాజు యొక్క) సుతుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; చేకొని = చేరదీసుకొని; శుక్రకుమారకుల్ = చండామార్కులు {శుక్రకుమారకులు - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు}; పఠింపించిరి = చదివింపించిరి; పాఠ్య = చదువ; యోగ్యములున్ = తగినట్టి; పెక్కులు = అనేకమైన; శాస్త్రములు = శాస్త్రములను; ఆ = ఆ; కుమారుడున్ = బాలుడు; ఆలించి = విని; పఠించెన్ = చదివెను; అన్నియున్ = అన్నిటిని; చలింపని = చెదరని; వైష్ణవ = విష్ణుని యెడలి; భక్తి = భక్తితో; పూర్ణుడు = నిండినవాడు; ఐ = అయ్యి.
७-१३४-उत्पलमाल
अंचितभक्तितोड दनुजाधिपु गेहसमीपमुं ब्रवे
शिंचि सुरारिराजसुतुँ जेकोनि शुक्रकुमारकुल् पठिं
पिंचिरि पाठयोग्यमुलु पेक्कुलु शास्त्रमु ला कुमारुँ डा
लिंचि पठिंचे नन्नियुँ जलिंपनि वैष्णवभक्तिपूर्णुँडै.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment