7-146-మత్తేభ విక్రీడితము
సురలం దోలుటయో, సురాధిపతులన్ స్రుక్కించుటో, సిద్ధులం
బరివేధించుటయో, మునిప్రవరులన్ బాధించుటో, యక్ష కి
న్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో,
హరి యంచున్ గిరియంచు నేల చెడ మోహాంధుండవై పుత్రకా!”

సురలన్ = దేవతలను; తోలుటయో = తరుముటసరికాని; సురా = దేవతలయొక్క; అధిపతులన్ = ప్రభువులను; స్రుక్కించుటో = భయపెట్టుటసరికాని; సిద్ధులన్ = సిద్ధులను; పరివేధించుటయో = పీడించుటసరికాని; ముని = మునులలో; ప్రవరులన్ = శ్రేష్టులను; బాధించుటో = బాధపెట్టుటసరికాని; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలు; గంధర్వ = గంధర్వులు; విహంగ = పక్షులు; నాగ = నాగవాసుల; పతులన్ = ప్రభువులను; నాశంబున్ = నాశనము; ఒందించుటో = చేయుటసరికాని; హరిన్ = హరి; అంచున్ = అనుచు; గిరి = గిరి; అంచున్ = అనుచు; ఏల = ఎందులకు; చెడన్ = చెడిపోవుట; మోహ = మోహముచే; అంధుడవు = గుడ్డివాడవు; ఐ = అయ్యి; పుత్రకా = కుమారుడా.
७-१४६-मत्तेभ विक्रीडितमु
सुरलं दोलुटयो, सुराधिपतुलन् स्रुक्किंचुटो, सिद्धुलं
बरिवेधिंचुटयो, मुनिप्रवरुलन् बाधिंचुटो, यक्ष कि
न्नर गंधर्व विहंग नागपतुलन् नाशंबु नोंदिंचुटो,
हरि यंचुन् गिरियंचु नेल चेड मोहांधुंडवै पुत्रका!”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment