Tuesday, November 24, 2015

ప్రహ్లాద చరిత్ర - ఈ పాపని

7-154-కంద పద్యము
పాపనిఁ జదివింతుము
నీ పాదము లాన యింక నిపుణతతోడం
గోపింతుము దండింతుము
కోపింపకు మయ్య దనుజకుంజర! వింటే.
7-155-వచనము
అని మఱియు నారాచపాపనికి వివిధోపాయంబులం బురోహితుండు వెఱపుఁజూపుచు రాజసన్నిధిం బాపి తోడికొనిపోయి యేకాంతంబున.
            ఓ రాక్షసేంద్రా! వినవయ్యా! కోప్పడ కయ్యా! మీ పాదాలమీద ఒట్టు. ఇకపై ఈ బాలుణ్ణి గట్టిగా కోప్పడి దండించి ఎలాగైనా సరే బాగా చదివిస్తాం. మా నైపుణ్యం చూపిస్తాం. మా మాట విను. అని పలికి ఆ రాకుమారుడు ప్రహ్లాదుడికి రకరకాలుగా భయం చెప్తూ, గురువు అతనిని రాక్షస రాజు దగ్గర నుండి బయటకు తీసుకెళ్లారు. ఒంటరిగా కూర్చోబెట్టి ఏకాంతంగా
          అని = అని; మఱియున్ = ఇంకను; = ; రాచ = రాజవంశపు; పాపని = పిల్లవాని; కిన్ = కి; వివిధ = రకరకముల; ఉపాయంబులన్ = ఉపయములతో; పురోహితుండు = గురువు; వెఱపు = భయము; చూపుచున్ = పెట్టుచూ; రాజ = రాజుయొక్క; సన్నిధిన్ = సాన్నిధ్యమునుండి; పాపి = దూరముచేసి; తోడికొనిపోయి = కూడాతీసుకెళ్లి; ఏకాంతంబునన్ = రహస్యమందు;
          ఈ = ; పాపని = పిల్లవానిని; చదివింతము = చదివించెదము; నీ = నీ యొక్క; పాదములు = పాదములు; ఆన = వట్టు; ఇంకన్ = ఇంకను; నిపుణత = నేర్పు; తోడన్ = తోటి; కోపింతుము = దెబ్బలాడెదము; దండింతుము = కొట్టెదము; కోపింపకము = కోపించకుము; అయ్య = తండ్రి; దనుజకుంజర = హిరణ్యకశిపుడు {దనుజకుంజరుడు - దనుజ (రాక్షసులలో) కుంజరుడ (ఏనుగువలె గొప్పవాడు), హిరణ్యకశిపుడు}; వింటే = వింటివే.
७-१५४-कंद पद्यमु
ई पापनिँ जदिविंतुमु
नी पादमु लान यिंक निपुणततोडं
गोपिंतुमु दंडिंतुमु
कोपिंपकु मय्य दनुजकुंजर! विंटे.
७-१५५-वचनमु
अनि मर्रियु नाराचपापनिकि विविधोपायंबुलं बुरोहितुंडु वेर्रपुँजूपुचु राजसन्निधिं बापि तोडिकोनिपोयि येकांतंबुन.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: