7-136-శార్దూల విక్రీడితము
అంతం గొన్నిదినంబు లేగిన సురేంద్రారాతి శంకాన్విత
స్వాంతుండై నిజనందనున్ గురువు లే జాడం బఠింపించిరో
భ్రాంతుం డేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యాపరి
శ్రాంతిం జూచెదఁ గాక నేఁ డని మహాసౌధాంతరాసీనుఁడై.
తరువాత కొన్నాళ్శకి,
హిరణ్యకశిపుడు పెద్ద రాజగృహంలో కూర్చుని “నా కొడుకు, ప్రహ్లాదుడు, వెఱ్ఱిబాగుల
పిల్లాడు; ఏం చదువుతున్నాడో; వాళ్ళేం చెప్తున్నారో
యేమో? ఇవాళ కొడుకును గురువులను
పిలిచి పలకరిద్దాం. ఎంత బాగా చదువుతున్నాడో చూద్దాం” అని
అనుకున్నాడు.
అంతన్ = అంతట; కొన్ని = కొన్ని; దినంబులున్ = రోజులు; ఏగినన్ = గడవగా; సురేంద్రారాతి = హిరణ్యకశిపుడు {సురేంద్రారాతి - సురేంద్ర (దేవేంద్రుని) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు}; శంక = అనుమానము; ఆన్విత = కలిగిన; స్వాంతుండు = మనసుగలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; నందనున్ = పుత్రుని; గురువులు = గురువులు; ఏ = ఏ; జాడన్ = విధముగ; పఠింపించిరో = చదివించిరో; భ్రాంతుండు = వెర్రివాడు; ఏమి = ఏమి; పఠించెనో = చదివినాడో; పిలిచి = పిలిచి; సంభాషించి = మాట్లాడి; విద్యా = విద్యలందు; పరిశ్రాంతిన్ = పరిచయమును; చూచెదగాక = పరిశీలించెదనుగాక; నేడు = ఈ దినమున; అని = అని; మహా = పెద్ద; సౌధ = మేడ; అంతర = లో; ఆసీనుడు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి.
७-१३६-शार्दूल विक्रीडितमु
अंतं गोन्निदिनंबु लगिन सुरेंद्राराति शंकान्वित
स्वांतुंडै निजनंदनुन् गुरुवु ले जाडं बठिंपिंचिरो
भ्रांतुं डेमि पठिंचेनो पिलिचि संभाषिंचि विद्यापरि
श्रांतिं जूचेदँ गाक नेँ डनि महासौधांतरासीनुँडै.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment