7-137-ఉత్పలమాల
మోదముతోడ దైత్యకులముఖ్యుడు రమ్మని చీరఁ బంచె బ్ర
హ్లాదకుమారకున్ భవమహార్ణవతారకుఁ గామ రోష లో
భాది విరోధివర్గ పరిహారకుఁ గేశవచింతనామృతా
స్వాద కఠోరకుం గలుషజాల మహోగ్రవనీకుఠారకున్.
7-138-వచనము
ఇట్లు చారులచేత నాహూయమానుం డై ప్రహ్లాదుండు చనుదెంచిన.
ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు మహదానందముతో తన కొడుకు
ప్రహ్లాదుడిని తీసుకురమ్మని కబురు పంపాడు. సంసార సముద్రం తరించినవాడూ, కామ
క్రోధాది అరిషడ్వర్గాలను అణచినవాడూ, శ్రీహరి
చింత తప్ప వేరెరుగని వాడూ, పాపాలనే ఘోరమైన అడవుల
పాలిటి గొడ్డలి వంటి వాడూ అయిన ఆ ప్రహ్లాదకుమారుని పిలుచుకు రమ్మని పంపాడు.
అలా భటులు
తీసుకురాగా, ప్రహ్లాదుడు తండ్రి వద్దకు వచ్చాడు.
మోదము = సంతోషము; తోడన్ = తోటి; దైత్యకులముఖ్యుడు = హిరణ్యకశిపుడు {దైత్యకులముఖ్యుడు - దైత్య (రాక్షస) కుల (వంశమునకు) ముఖ్యుడు, హిరణ్యకశిపుడు}; రమ్ము = రావలసినది; అని = అని; చీరన్ = పిలువ; పంచెన్ = పంపించెను; ప్రహ్లాద = ప్రహ్లాదుడు యనెడి; కుమారకున్ = పిల్లవానిని; భవ = సంసార; మహార్ణవ = సాగరమును; తారకున్ = తరించినవానిని; కామ = కామము; రోష = కోపము; లోభ = లోభము; ఆది = మొదలగు; విరోధివర్గ = శత్రుసమూహమును; పరిహారకున్ = అణచినవానిని; కేశవ = నారాయణుని; చింతనా = ధ్యానించుట యనెడి; అమృత = అమృతమును; ఆస్వాద = తాగుటచే; కఠోరకున్ = గట్టిపడినవానిని; కలుష = పాపపు; జాల = పుంజములనెడి; మహా = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; అవనీ = నేలలకు; కుఠారకున్ = గునపమువంటివానిని.
ఇట్లు = ఈ విధముగ; చారులు = సేవకుల; చేతన్ = ద్వారా; ఆహూయమానుండు = పిలువబడినవాడు; ఐ = అయ్యి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; చనుదెంచిన = రాగా.
७-१३७-उत्पलमाल
मोदमुतोड दैत्यकुलमुख्युडु रम्मनि चीरँ बंचे ब्र
ह्लादकुमारकुन् भवमहार्णवतारकुँ गाम रोष लो
भादि विरोधिवर्ग परिहारकुँ गेशवचिंतनामृता
स्वाद कठोरकुं गलुषजाल महोग्रवनीकुठारकुन्.
७-१३८-वचनमु
इट्लु चारुलचत नाहूयमानुं डै प्रह्लादुंडु चनुदेंचिन.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment