7-135-కంద పద్యము
ఏ పగిది వారు చెప్పిన
నా పగిదిం జదువుఁగాని యట్టిట్టని యా
క్షేపింపఁడు తా నన్నియు
రూపించిన మిథ్య లని నిరూఢమనీషన్.
ప్రహ్లాదుడు వారు చెప్పినవి అన్నీ తాను చక్కగ విచారించి
అనిత్యాలని తెలుసుకున్న వాడు అయినా, వారు చెప్పినట్లు విని చదివేవాడు తప్ప అలా
కాదని తప్పుపట్టేవాడు కాదు, గురువులకు ఎదురు చెప్పి ఆక్షేపించేవాడు కాదు.
ఏ = ఏ; పగిదిన్ = విధముగ; వారున్ = వారు; చెప్పినన్ = చెప్పిరో; ఆ = ఆ; పగిదిన్ = విధముగనే; చదువున్ = పఠించున్; కాని = కాని; అట్టిట్టు = అలాకాదు ఇలాకాదు; అని = అని; ఆక్షేపింపడు = అడ్డుచెప్పడు, వెక్కిరించడు; తాను = తను; అన్నియున్ = సర్వమును; రూపించిన = నిరూపించినట్టి; మిథ్యలు = అసత్యములు; నిరూఢ = దృఢమైన; మనీషన్ = ప్రజ్ఞతో.
७-१३६-शार्दूल विक्रीडितमु
अंतं गोन्निदिनंबु लगिन सुरेंद्राराति शंकान्वित
स्वांतुंडै निजनंदनुन् गुरुवु ले जाडं बठिंपिंचिरो
भ्रांतुं डेमि पठिंचेनो पिलिचि संभाषिंचि विद्यापरि
श्रांतिं जूचेदँ गाक नेँ डनि महासौधांतरासीनुँडै.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment