7-164-శార్దూల విక్రీడితము
నిన్నున్ మెచ్చరు నీతిపాఠమహిమన్ నీతోటి దైత్యార్భకుల్
కన్నా రన్నియుఁ జెప్ప నేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై
యన్నా! యెన్నఁడు నీవు నీతివిదుఁ డౌ దంచున్ మహావాంఛతో
నున్నాడన్ ననుఁ గన్నతండ్రి భవదీయోత్కర్షముం జూపవే.”
7-165-వచనము
అనినం గన్నతండ్రికిఁ బ్రియనందనుం డయిన ప్రహ్లాదుం డిట్లనియె.
కుమారా! నా కన్న తండ్రీ! నీ తోడి దైత్య విద్యార్థులు
నీతిశాస్త్రం నీకంటే బాగా చదువుతున్నారు అట కదా! అందుచేత నిన్ను లెక్కచేయటం లేదుట కదా! మరి
నువ్వెప్పుడు గొప్ప నీతికోవిదుడవు అవుతావు? నేను ఎంతో కోరికతో
ఎదురుచూస్తున్నాను. ఏదీ చదువులో నీ ప్రతిభపాటవాలు నాకొకసారి చూపించు.”
అలా అన్న తండ్రి హిరణ్యకశిపుడితో ఇష్ట పుత్రుడైన ప్రహ్లాదుడు
ఇలా అన్నాడు.
నిన్నున్ = నిన్ను; మెచ్చరు = మెచ్చుకొనరు; నీతి = నీతిశాస్త్రమును; పాఠ = చదివిన; మహిమన్ = గొప్పదనమును; నీ = నీ; తోటి = సహపాఠకులైన; దైత్య = రాక్షస; అర్భకుల్ = బాలకులు; కన్నారు = నేర్చుకొన్నారు; అన్నియున్ = అన్నిటిని; చెప్పన్ = చెప్పుట; నేర్తురు = నేర్చుకొంటిరి; కదా = కదా; గ్రంథ = గ్రంథముల; అర్థముల్ = అర్థములను; దక్షులు = నేర్పరులు; ఐ = అయ్యి; అన్నా = నాయనా; ఎన్నడున్ = ఎప్పుడు; నీవు = నీవు; నీతి = నీతిశాస్త్రమున; కోవిదుడవు = విద్వాంసుడవు; ఔదు = అయ్యెదవు; అంచున్ = అనుచు; మహా = మిక్కలి; వాంఛ = కోరిక; తోన్ = తో; ఉన్నాడను = ఉన్నాను; నను = నను; కన్నతండ్రి = కన్నతండ్రి; భవదీయ = నీ యొక్క; ఉత్కర్షమున్ = గొప్పదనమును; చూపవే = చూపించుము.
అనినన్ = అనగా; కన్న = తనకు జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రియ = ఇష్ట; నందనుండు = సుతుడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; అనియె = పలికెను.
७-१६४-शार्दूल विक्रीडितमु
निन्नुन् मेच्चरु नीतिपाठमहिमन् नीतोटि
दैत्यार्भकुल्
कन्ना रन्नियुँ जेप्प नेर्तुरु गदा
ग्रंथार्थमुल् दक्षुलै
यन्ना! येन्नँडु नीवु नीतिविदुँ डौ दंचुन्
महावांछतो
नुन्नाडन् ननुँ गन्नतंड्रि भवदीयोत्कर्षमुं
जूपवे.
७-१६५-वचनमु
अनिनं गन्नतंड्रिकिँ ब्रियनंदनुं डयिन
प्रह्लादुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment