7-124-సీస పద్యము
వైకుంఠచింతావివర్జిత చేష్టుఁ డై; యొక్కఁడు నేడుచు నొక్కచోట;
నశ్రాంత హరిభావనారూఢచిత్తుఁ డై; యుద్ధతుఁ డై పాడు నొక్కచోట;
విష్ణుఁడింతియ కాని వేఱొండు లేదని; యొత్తిలి నగుచుండు నొక్కచోట;
నళినాక్షుఁ డను నిధానముఁ గంటి నే నని; యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ;
7-124.1-ఆటవెలది
బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ; బ్రణయహర్ష జనిత బాష్పసలిల
మిళితపులకుఁ డై నిమీలితనేత్రుఁ డై; యొక్కచోట నిలిచి యూరకుండు.
పరీక్షన్మహారాజా!
అతడు ఒక్కక్క చోట విష్ణుధ్యానము లభించ లేదని ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు. ఒక్కక్క చోట
విష్ణువు మీద మనసు నిలిపి, ఆనందముతో బాధపడుతూ ఉంటాడు. విష్ణుమూర్తి
ఇంతేలే అంటూ ఒక్కోసారి పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఒక్కోచోట నాకు విష్ణువు అనే లాభం
దొరకింది అని చిందులుతొక్కుతాడు. ఇంకోచోట విష్ణునామ సంకీర్తనము చేస్తూ ఉంటాడు.
మరింకోచోట భక్తి తాత్పర్యాదులతో ఆనందభాష్పాలు కారుస్తూ, ఒడలు గగుర్పొడుస్తుండగా
కనులు మూసికొని మిన్నకుంటాడు.
వైకుంఠ = నారాయణుని; చింతా = ధ్యానముచేత; వివర్జిత = వదలివేసిన; చేష్టుడు = వ్యాపారములుగలవాడు; ఒక్కడున్ = ఒంటరిగా; ఏడుచున్ = విలపించును; ఒక్కచోట = ఒకమాటు; అశ్రాంత = ఎడతెగని; హరి = నారాయణుని; భావనా = ధ్యానమునందు; ఆరూఢ = నిలుపబడిన; చిత్తుడు = మనసుగలవాడు; ఐ = అయ్యి; ఉద్ధతుడు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; పాడున్ = పాడును; ఒక్కచోట = ఒకమాటు; విష్ణుడు = విష్ణుమూర్తే; ఇంతయున్ = ఇదంతా; కాని = అంతేకాని; వేఱొండు = మరితరమైనది; లేదు = ఏమియు లేదు; అని = అని; ఒత్తిలి = గట్టిగా; నగుచున్ = నవ్వుతూ; ఉండున్ = ఉండును; ఒక్కచోట = ఒకమాటు; నళినాక్షుడు = హరి {నళినాక్షుడు - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అను = అనెడి; నిధానమున్ = నిధిని; కంటిన్ = కనుగొంటిని; నేను = నేను; అని = అని; ఉబ్బి = పొంగిపోయి; గంతులు = ఉత్సాహముతో ఉరకలు; వైచున్ = వేయును; ఒక్కచోట = ఒకమాటు; పలుకున్ = మాట్లాడుచుండును; ఒక్కచోట = ఒకమాటు; పరమేశున్ = నారాయణుని; కేశవున్ = నారాయణుని; ప్రణయ = మిక్కలి భక్తిచేగలిగిన; హర్ష = సంతోషమువలన; జనిత = పుట్టిన; సలిల = కన్నీటితో; మిళిత = కలగలిసిన; పులకుడు = గగుర్పాటగలవాడు; ఐ = అయ్య.
నిమీలిత = అరమూసిన; నేత్రుడు = కన్నులుగలవాడు; ఐ = అయ్యి; ఒక్కచోట = ఒకప్రదేశములో; నిలిచి = ఆగిపోయి; ఊరకన్ = ఉత్తినే; ఉండున్ = ఉండును.
७-१२४-सीस पद्यमु
वैकुंठचिंताविवर्जित चेष्टुँ डै; योक्कँडु
नेडुचु नोक्कचोट;
नश्रांत हरिभावनारूढचित्तुँ डै; युद्धतुँ डै
पाडु नोक्कचोट;
विष्णुँडिंतिय कानि वेर्रोंडु लेदनि; योत्तिलि
नगुचुंडु नोक्कचोट;
नळिनाक्षुँ डनु निधानमुँ गंटि ने ननि; युब्बि
गंतुलुवैचु नोक्कचोटँ;
७-१२४.१-आटवेलदि
बलुकु नोक्कचोटँ बरमशुँ गेशवुँ; ब्रणयहर्ष
जनित बाष्पसलिल
मिळितपुलकुँ डै निमीलितनेत्रुँ डै; योक्कचोट
निलिचि यूरकुंडु.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment