Monday, November 16, 2015

ప్రహ్లాద చరిత్ర - ఎట్టాడిన

7-143-వచనము
అని కుమారకుం డాడిన ప్రతిపక్షానురూపంబు లయిన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు నిట్లనియె.
7-144-కంద పద్యము
ట్టాడిన నట్టాడుదు
రిట్టిట్టని పలుక నెఱుఁగ రితరుల శిశువుల్
ట్టించి యెవ్వ రేమని
ట్టించిరొ బాలకునకుఁ రపక్షంబుల్
            ఇలా శత్రు పక్షానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్న కొడుకు సల్లాపాలు విని, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు. మిగతా వాళ్ళందరి పిల్లలు ఎలా చెప్తే అలా వింటారు. ఎదురు చెప్పనే చెప్పరు. చిన్న పిల్లాడికి శత్రు పక్షానికి అనుకూలమైన వాదాలు ఎవరు ఇంత గట్టిగా ఎక్కించారో ఏమిటో?
            అని = అని; కుమారకుండు = పుత్రుడు; ఆడిన = పలికిన; ప్రతిపక్ష = విరోధులకు; అనురూపంబులు = అనుకూలమైనవి; అయిన = ఐన; సల్లాపంబులున్ = మాటలను; విని = విని; దానవేంద్రుడు = హిరణ్యకశిపుడు; నగుచున్ = నవ్వుతూ; ఇట్లు = విధముగ; అనియె = పలికెను.
            ఎట్టు = విధముగ; ఆడిన = చెప్పినచో; అట్టు = విధముగనే; ఆడుదురు = పలికెదరు; అట్టిట్టు = అలా ఇలా; అని = అని; పలుకన్ = చెప్ప; ఎఱుగరు = లేరు; ఇతరుల = ఇతరుల యొక్క; శిశువుల్ = పిల్లలు; దట్టించి = ఎక్కించి; ఎవ్వరు = ఎవరు; ఏమి = ఏమి; అని = అని; పట్టించిరో = నేర్పిరో; బాలకున్ = పిల్లవాని; కున్ = కి; పర = శత్రువు; పక్షంబుల్ = పక్కవైనట్టివానిని.
७-१४३-वचनमु
अनि कुमारकुं डाडिन प्रतिपक्षानुरूपंबु लयिन सल्लापंबुलु विनि दानवेंद्रुंडु नगुचु निट्लनिये.
७-१४४-कंद पद्यमु
एट्टाडिन नट्टाडुदु
रिट्टिट्टनि पलुक नेर्रुँग रितरुल शिशुवुल्
दट्टिंचि येव्व रेमनि
पट्टिंचिरो बालकुनकुँ बरपक्षंबुल्
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: