7-126-శార్దూల విక్రీడితము
పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్
మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే
శత్రుత్వంబుఁ దలంప రెట్టి యెడ నా సౌజన్యరత్నాకరుం
బుత్రున్ లోకపవిత్రుఁ దండ్రి నెగులుంబొందింప నెట్లోర్చెనో.
7-127-ఉత్పలమాల
బాలుఁ బ్రభావిశాలు హరిపాదపయోరుహచింతనక్రియా
లోలుఁ గృపాళు సాధుగురులోకపదానతఫాలు నిర్మల
శ్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండితమోహవల్లికా
జాలు న దేల? తండ్రి వడిఁ జంపఁగఁ బంపె మునీంద్ర! చెప్పవే.
7-128-వచనము
అనిన నారదుం డిట్లనియె.
“నారదమహర్షీ!
లోకంలో తల్లిదండ్రులు కొడుకులు తెలిసినవాళ్ళైనా తెలియనివాళ్ళైనా రక్షిస్తూ ఉంటారు.
తెలియకపోతే బుద్ధిచెప్పి సరిదిద్దుతారు. ఎప్పుడి పిల్లలను ప్రేమతో పెంచుతారు.
అంతేగాని శత్రుత్వము చూపించరు కదా. ఇలా ఎక్కడా జరగదు వినం కూడా. అలాంటిది బహు
సౌమ్యుడు లోకాన్ని పావనం చేసేవాడు అయిన కొడుకును ఏ తండ్రి మాత్రం బాధిస్తాడు?
అలాంటి వాడిని హింసించటానికి వాడికి మనసెలా ఒప్పింది.
నారదా!
ప్రహ్లాదుడు చిన్నపిల్లాడూ, (కుర్రాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు, కనుక
మన్నించటం న్యాయం అంతే తప్ప దండించడం తగదు) తేజోవంతుడూ, విష్ణుభక్తి గలవాడూ,
సాధువుల గురువుల సేవ చేసేవాడూ, మంగళ స్వభావము కలవాడూ, సాధువులు పొగిడే ప్రవర్తన కల
వాడూ, మోహపాశాలను త్రెంపుకున్న వాడూ. అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి చంపాలని
ఎందుకు అనుకున్నాడు చెప్పండి.” అని ధర్మరాజు నారదుడిని అడిగాడు.
అలా అడిగిన
ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు.
పుత్రుల్ = కొడుకులు; నేర్చినన్ = నేర్చుకొన్నను; నేరకున్నన్ = నేర్చుకొనకపోయినను; జనకుల్ = తండ్రులు; పోషింతురు = పోషించెదరు; ఎల్లప్పుడున్ = ఎప్పుడైనను; మిత్రత్వంబునన్ = చనువుతో; బుద్ది = మంచిబుద్ధులు; చెప్పి = చెప్పి; దురిత = పాప; ఉన్మేషంబునన్ = చింతనముతో; వారింతురే = అడ్డుకొనెదరా ఏమి; శతృత్వంబున్ = విరోధమును; తలపరున్ = తలపెట్టరు; ఎట్టి = ఎటువంటి; ఎడన్ = పరిస్థితులలోను; సౌజన్య = మంచివారిలక్షణములకు; రత్నాకరున్ = సముద్రమువంటివానిని; పుత్రున్ = కుమారుని; లోక = సర్వలోకములను; పవిత్రున్ = పావనముచేసెడివానిని; తండ్రి = తండ్రి; నెగులున్ = కష్టములను; పొందింపన్ = పెట్టించుటకు; ఎట్లు = ఏవిధముగ; ఓర్చెనో = ఓర్చుకొనగలిగెనో కదా.
బాలున్ = చిన్నపిల్లవానిని; ప్రభా = తేజస్సు; విశాలున్ = అధికముగగలవానిని; హరి = నారాయణుని; పాద = పాదములనెడి; పయోరుహ = పద్మములందు; చింతన = ధ్యానించెడి; క్రియా = పనిలో; లోలున్ = తగిలి యుండెడివానిని; కృపాళున్ = భూతదయగలవానిని; సాధు = సజ్జనులు; గురు = పెద్దలు; లోక = అందరి; పద = పాదముల యందు; ఆనత = మోపిన; ఫాలున్ = నొసలుగలవానిని; నిర్మల = స్వచ్చమైన; శ్రీలున్ = శోభగలవానిని; సమస్త = అఖిలమైన; సభ్య = సంస్కారవంతులచేత; నుత = స్తుతింపడెడి; శీలున్ = నడవడికగలవానిని; విఖండిత = మిక్కిలి తెంపబడిన; మోహ = అజ్ఞానము యనెడి; వల్లికా = తీగల; చాలునన్ = సమూహమునందు; అది = అలా; ఏల = ఎందుకు; తండ్రి = (కన్న)తండ్రి; వడిన్ = శ్రీఘ్రముగ; చంపగన్ = చంపుబడుటకు; పంపెన్ = పంపించెను; ముని = మునులలో; ఇంద్ర = ఉత్తముడా; చెప్పవే = చెప్పుము.
అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
७-१२६-शार्दूल विक्रीडितमु
पुत्रुल् नेर्चिन नेरकुन्न जनकुल् पोषिंतु रेल्लप्पुडुन्
मित्रत्त्वंबुन बुद्धि चेप्पि दुरितोन्मेषंबु वारिंतु रे
शत्रुत्वंबुँ दलंप रेट्टि येड ना सौजन्यरत्नाकरुं
बुत्रुन् लोकपवित्रुँ दंड्रि नेगुलुंबोंदिंप नेट्लोर्चेनो.
७-१२७-उत्पलमाल
बालुँ ब्रभाविशालु हरिपादपयोरुहचिंतनक्रिया
लोलुँ गृपाळु साधुगुरुलोकपदानतफालु निर्मल
श्रीलु समस्त सभ्यनुतशीलु विखंडितमोहवल्लिका
जालु न देल? तंड्रि वडिँ जंपँगँ बंपे मुनींद्र! चेप्पवे.
७-१२८-वचनमु
अनिन नारदुं डिट्लनिये.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment