85- ఉ.
బల్లిదు, నన్ను భీష్మజనపాలకుమారకుఁ
జిన్న చేసి నా
చెల్లెలి రుక్మిణిం
గొనుచుఁ జిక్కని నిక్కపు బంటుబోలె నీ
గొల్లఁడు పోయెడిన్; రథము గూడఁగఁ
దోలుము; తేజితోల్లస
ద్భల్ల
పరంపరన్ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్.
“బలవంతుడను. భీష్మకమహారాజు కొడుకుని. రుక్మిని, నన్ను
చిన్నబుచ్చి ఈ గొల్లవాడు కృష్ణుడు తానేదో మహా శూరుడిని అనుకుంటు నా చెల్లెలు
రుక్మిణిని పట్టుకు పోతున్నాడు. సారథి! వాని వెంటనంటి రథం
తోలు. నా ప్రతాపం చూపిస్తా. పదునైన బాణాలతో వాని మదం తీస్తా.”
85- u.
ballidu, nannu bheeShmajanapaalakumaarakuM~ jinna chEsi naa
chelleli rukmiNiM gonuchuM~ jikkani nikkapu baMTubOle nee
gollaM~Du pOyeDin; rathamu gooDaM~gaM~ dOlumu; tEjitOllasa
dbhalla paraMparan madamuM~ baapedaM~ joopeda naa prataapamun.
బల్లిదున్ = బలవంతుడను; నన్నున్ = నన్ను; భీష్మ = భీష్మక; జనపాల = రాజు యొక్క; కుమారకున్ = పుత్రుని; చిన్నచేసి = చిన్నబుచ్చి; నా = నా యొక్క; చెల్లెలిన్ = సోదరిని; రుక్మిణిన్ = రుక్మిణిని; కొనుచున్ = తీసుకుపోవుచు; చిక్కని = పటుత్వముగల; నిక్కపు = నిజమైన; బంటు = శూరుని; బోలెన్ = వలె; ఈ = ఈ యొక్క; గొల్లడు = యాదవుడు; పోయెడిన్ = వెళ్ళిపోతున్నాడు; రథమున్ = తేరును; కూడగన్ = చేరునట్లు; తోలుము = వేగముగ నడుపుము; తేజిత = వాడిగాచేయబడిన; ఉల్లసత్ = ప్రకాశించుచున్న; భల్ల = బాణముల; పరంపరన్ = వరుసలచే; మదమున్ = గర్వమును; పాపెదన్ = పోగొట్టెదను; చూపెదన్ = చూపించెదను; నా = నా యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment