82- వ.
వినుము, దేహధారి స్వతంత్రుండు గాఁడు, జంత్రగాని చేతి జంత్రపు
బొమ్మ కైవడి నీశ్వరతంత్ర పరాధీనుండై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు
సలుపుఁ; దొల్లి యేను మథురాపురంబుపైఁ బదియేడు మాఱులు పరాక్రమంబున
విడిసి, సప్తదశ వారంబులు చక్రిచేత నిర్మూలిత బలచక్రుండనై కామపాలుచేతం
బట్టుబడి కృష్ణుండు గరుణ చేసి విడిపించి పుచ్చిన వచ్చి క్రమ్మఱ నిరువదిమూ
డక్షౌహిణులం గూడుకొని పదు నెనిమిదవ మాఱు దాడిచేసి శత్రువులం దోలి విజయంబు చేకొంటిని
యిట్టి జయాపజయంబు లందు హర్షశోకంబులం జెంద నే నెన్నండు; నేటి
దినంబున నీ కృష్ణు నెదిరి పోర మన రాజలోకం బెల్ల నుగ్రాక్షుం గూడికొని పోరిన నోడుదు
మింతియ కాక దైవయుక్తంబైన కాలంబునం జేసి లోకంబులు పరిభ్రమించుచుండును; అదియునుం గాక.
ఇంకా విను. పురుషుడు
స్వతంత్రుడు కాడు. కీలు బొమ్మలాడించే వాడిచేతిలోని కీలుబొమ్మ లాగ ఈశ్వర మాయకు లోనై
సుఖదుఃఖాలలో నర్తిస్తుంటాడు. ఇంతకు ముందు నేను మథుర మీద పదిహేడు సార్లు
దండెత్తాను. పదిహేడు సార్లు మాధవుని చేతిలో ఓడి బలాల్ని నష్టపోయాను. బలరాముడి
చేతికి చిక్కి కృష్ణుడు దయచూపి విడిపించాడు. పద్దెనిమిదో సారి ఇరవైమూడు అక్షౌహిణుల
సేనతో దాడి చేసి శత్రువులని పారదోలి విజయం సాధించా. ఇలాంటి గెలుపోటములకు ఎప్పుడు
మోదఖేదములు చెందను. ఇవాళ కనక రుద్రుణ్ణి కూడగొట్టుకొని మన రాజు లందరం పోరాడినా
కృష్ణుణ్ణి గెలవలేము. ఇది ఇంతే. కాల మహిమని బట్టే లోకం నడుస్తుంటుంది. అంతేకాక
10.1-1761-వ.
వినుము = శ్రద్ధగా వినుము; దేహధారి = పురుషుడు {దేహధారి - శరీరము ధరించినవాడు, పురుషుడు}; స్వతంత్రుడు = స్వతంత్రత కలవాడు; కాడు = కాలేడు; జంత్రగాని = సూత్రధారి {యంత్రము (ప్ర) - జంత్రము (వి)}; చేతి = చేతిలోని; జంత్రపుబొమ్మ = కీలుబొమ్మ; కైవడిన్ = వలె; ఈశ్వర = భగవంతుని; తంత్ర = పాలనకు; పరాధీనుండు = అదీనుడు; ఐ = అయ్యి; సుఖ = సుఖములను; దుఃఖంబులు = దుఖములు; అందు = లో; నర్తనంబులు = నాట్యములు; సలుపున్ = చేయుచుండును; తొల్లి = పూర్వము; ఏను = నేను; మథురాపురంబు = మథురానగరి; పైన్ = మీదికి; పదియేడు = పదిహేడు (17); మాఱులు = పర్యాయములు; పరాక్రమంబునన్ = శౌర్యముతో; విడిసి = చుట్టుముట్టి, దాడిచేసి; సప్తదశ = పదిహేడు (17); వారంబులున్ = పర్యాయములు; చక్రి = కృష్ణుని; చేతన్ = చే; నిర్మూలిత = నాశనముచేయబడిన; బల = సేనా; చక్రుండను = సమూహముగలవాడను; ఐ = అయ్యి; కామపాలు = బలరాముని; చేతన్ = చేతిలో; పట్టుబడి = చిక్కుకొని; కృష్ణుండు = కృష్ణుడు; కరుణ = దయ; చేసి = చూపి; విడిపించి = విడుదలచేయించి; పుచ్చినన్ = పంపగా; వచ్చి = వచ్చి; క్రమ్మఱన్ = మరల; ఇరువదిమూడు = ఇరవైమూడు (23); అక్షౌహిణులన్ =
అక్షౌహిణులసేనలు; కూడుకొని = కూడగట్టుకొని; పదునెనిమిదవ = పద్దెనిమిదవ (10); మాఱు = సారి;
దాడిచేసి = దండెత్తి; శత్రువులన్ = పగవారిని;
తోలి = తఱిమి; విజయంబున్ = విజయమును; చేకొంటిన్ = పొందితిని; ఇట్టి
= ఇటువంటి; జయ = గెలుపు; అపజయంబులు =
ఓటములు; అందున్ = అందు; హర్ష = సంతోషము;
శోకంబులన్ = దుఃఖములను; చెందన్ = పొందను;
నేన్ = నేను; ఎన్నడున్ = ఎప్పుడు కూడ; నేటి = ఇవాళ్టి; దినంబునన్
= రోజు; ఈ = ఈ యొక్క; కృష్ణున్ = కృష్ణుడిని;
ఎదిరి = ఎదిరించి; పోరన్ = యుద్దముచేసినచో;
మన = మన యొక్క; రాజ = రాజుల; లోకంబు = సమూహము; ఎల్లను = అంత; ఉగ్రాక్షున్ = పరమశివుని {ఉగ్రాక్షుడు - ఉగ్రమైన
కన్నులు కలవాడు, శివుడు}; కూడుకొని =
కూడగట్టుకొని; పోరినన్ = యుద్ధము చేసినను; ఓడుదుము = ఓడిపోదుము; ఇంతియ = ఇంతే; కాక = కాకుండ; దైవ = దేవునిర్ణయమునకు; యుక్తంబు = తగినది; ఐన = అయిన; కాలంబునన్ = కాలము; చేసి = వలన; లోకంబులున్ = సర్వలోకములు; పరిభ్రమించుచున్ =
తిరుగుతు; ఉండును = ఉండును; అదియునున్
= అంతే; కాక = కాకుండ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment