90- మత్త
కల్ల
లేదని విన్నవించుట గాదు
వల్లభ! యీతనిన్
బ్రల్లదుం దెగఁజూచితేనియు
భాగ్యవంతుల మైతి మే
మల్లుఁ
డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు
మోదితు లైన మా
తల్లిదండ్రులు
పుత్ర శోకము దాల్చి చిక్కుదు రీశ్వరా!”
ప్రభూ! మా అన్న రుక్మి యందు దోషం
లేదని మనవిచేయటం లేదు. నిజమే యితను చేసినది నేరమే. కాని మోక్షమునిచ్చేవాడు జగన్నాయకుడు
హరి మాకు అల్లుడు అయ్యా డని, మేము
అదృష్టవంతుల మైనామని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు, ఇతగాడు
దుష్టుడు కదా అని సంహరించే వంటే, పుత్రశోకంతో పొగిలిపోతారు
నాథా!
శ్రీకృష్ణుడు రాక్షసవివాహవిధానంలో
రుక్మిణీదేవిని తీసుకుపోతుంటే, ఆమె
అన్న రుక్మి వీరావేశంతో తరిమి ఎదిరించాడు. కృష్ణుడు ఖడ్గ మెత్తి నరకడానికి
సిద్దమౌతుంటే. అడ్డం వెళ్ళి రుక్మిణీదేవి వేడుకుంటోంది.
90- matta.
kalla lEdani vinnaviMchuTa gaadu vallabha! yeetanin
bralladuM degaM~joochitEniyu bhaagyavaMtula maiti mE
malluM Dayye mukuMduM~ DeeshvaruM~ DaMchu mOditu laina maa
tallidaMDrulu putra shOkamu daalchi chikkudu reeshvaraa!”
కల్ల = తప్పు; లేదు = చేయలేదు; అని = అని; విన్నవించుట = చెప్పుట; కాదు = లేదు; వల్లభ = ప్రియమైనవాడ; ఈతనిన్ = అతనిని; ప్రల్లదున్ = దుష్టుడను; తెగజూచితేనియున్ = చంపబోయితివేని; భాగ్యవంతులము = అదృష్టవంతులము; ఐతిమి = అయినాము; మేము = మేము; అల్లుండు = అల్లుడు {అల్లుడు - కూతురు భర్త}; అయ్యెన్ = అయ్యెను; ముకుందుడు = మోక్షమునిచ్చువాడు; ఈశ్వరుడు = ఐశ్వర్యవంతుడు, కృష్ణుడు; అంచున్ = అని; మోదితుల = సంతోషించినవారు; ఐన = అయిన; మా = మా యొక్క; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; పుత్ర = కొడుకుమరణించిన; శోకమున్ = దుఃఖమును; తాల్చి = పొంది; చిక్కుదురు = కృశింతురు; ఈశ్వరా = స్వామీ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment