94- క.
కొందఱు
రిపులని కీడును;
గొందఱు హితులనుచు
మేలుగూర్పవు; నిజ మీ
వందఱి
యందును సముఁడవు;
పొందఁగ
నేలయ్య విషమబుద్ధి? ననంతా!
శాశ్వతుడవైన దేవా! నిజానికి నీవు సర్వ సముడవు. ఎవరిని శత్రువులుగా చూసి కీడు చేయవు. ఎవరిని
కావలసినవారుగా చూసి మేలు చేయవు. అలాంటి నీకు ఎందుకయ్య ఇలాంటి భేదబుద్ది. - రుక్మి
శిరోజములు తొలగించిన కృష్ణునితో బలరాముడు ఇలా అనసాగాడు.
94- ka.
koMdaRru ripulani keeDunu;
goMdaRru hitulanuchu mElugoorpavu; nija mee
vaMdaRri yaMdunu samuM~Davu;
poMdaM~ga nElayya viShamabuddhi? nanaMtaa!
కొందఱున్ = కొంతమంది; రిపులు = శత్రువులు; అని = అని; కీడును = చెడును; కొందఱున్ = కొంతమంది; హితులు = ఇష్ఠులు; అనుచున్ = అని; మేలున్ = మంచిని; కూర్పవు = కలిగింపవు; నిజము = సత్యము ఇది; ఈవు = నీవు; అందఱి = అందరి; అందును = ఎడల; సముడవు = సమ భావము గలవాడవు; పొందగన్ = పొందుట; ఏలన్ = ఎందుకు; అయ్య = తండ్రీ; విషమ = భేద; బుద్ధిన్ = బుద్ధిని; అనంతా = కృష్ణా {అనంతుడు - దేశ కాల వస్తువులచేత మేరలేని వాడు, విష్ణువు}.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment