86- వ.
అని
యిట్లు రుక్మి హరి కొలంది యెఱుంగక సారథి నదలించి, రథంబుఁ గూడం దోలించి “గోపాలక! వెన్నముచ్చ! నిమిష
మాత్రంబు నిలు నిలు” మని ధిక్కరించి, బలువింట నారి యెక్కించి మూడు
వాఁడి తూపుల హరి నొప్పించి యిట్లనియె.
ఇలా పలికి. రుక్మి మాధవుని
మహిమ తెలియక రథం మీద వెనుదగిలి పోయి “ఓ గొల్లాడ! వెన్న దొంగ!
ఒక్క నిమిషం ఆగు” అని
అదలించాడు. పెద్ద వింటిని సంధించి మూడు వాడి తూపులతో చక్రిని కొట్టాడు.
86- va.
ani yiTlu rukmi hari kolaMdi yeRruMgaka saarathi nadaliMchi,
rathaMbuM~ gooDaM dOliMchi “gOpaalaka! vennamuchcha! nimiSha maatraMbu nilu
nilu” mani dhikkariMchi, baluviMTa naari
yekkiMchi mooDu vaaM~Di toopula hari noppiMchi yiTlaniye.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; రుక్మి = రుక్మి; హరి = కృష్ణుని; కొలంది = సామర్థ్యము; ఎఱుంగక = తెలియకపోవుటచేత; సారథిన్ = సారథిని; అదలించి = హెచ్చరించి; రథంబున్ = రథమును; కూడన్ = చేరునట్లు; తోలించి = వేగముగా నడిపింపజేసి; గోపాలక = గొల్లవాడా; వెన్నముచ్చ = వెన్నదొంగ; నిమిషమాత్రంబు = ఒక నిమిషముపాటు; నిలునిలుము = ఆగిపొమ్ము; అని = అని; ధిక్కరించి = తిరస్కారముగా మాట్లాడి; బలు = బలమైన; వింటన్ = విల్లునందు; నారిన్ = అల్లెతాడును; ఎక్కించి = ఎక్కుపెట్టి; మూడు = మూడు (3); వాడి = వాడి యైన; తూపులన్ = బాణములచేత; హరిన్ = కృష్ణుని; నొప్పించి = కొట్టి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment