Saturday, January 31, 2015

రుక్మిణీకల్యాణం - హరి యీ తెఱగున

108- క.
రి యీ తెఱఁగున రుక్మిణి
రుదుగఁ గొనివచ్చి పెండ్లియాడుట విని దు
ష్కకృత్య మనుచు వెఱగం
దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్.
          ముకుందుడు శ్రీకృష్ణుడు రుక్మణీదేవిని అపూర్వంగా తీసుకొచ్చి యిలా వివాహమాడిన విధము, బహు దుస్సాధ్య మైన విషయం అనుచు ప్రపంచంలోని రాజులు, రాకుమారులు, అందరు అచ్చరువొందారు. అంటు పరీక్షిత్తునకు శుకుడు చెప్పసాగాడు.
108- ka.
hari yee teRraM~guna rukmiNi
narudugaM~ gonivachchi peMDliyaaDuTa vini du
ShkarakRitya manuchu veRragaM
diri raajulu raajasutulu dikkula nellan.
          హరి = కృష్ణుడు; = ; తెఱగునన్ = విధముగ; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని; అరుదుగన్ = అద్భుతముగా; కొనివచ్చి = తీసుకొచ్చి; పెండ్లి = వివాహము; ఆడుట = చేసికొనుట; విని = విని; దుష్కర = అసాధ్యమైన; కృత్యము = పని; అనుచు = అని; వెఱగందిరి = ఆశ్చర్యపడిరి; రాజులున్ = రాజులు; రాజసుతులున్ = రాకుమారులు; దిక్కులన్ = అన్ని వైపుల ఉన్నవారు; ఎల్లన్ = అందరును.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: