Wednesday, January 28, 2015

రుక్మిణీకల్యాణం - ధ్రువకీర్తిన్


105- మ.
ధ్రుకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
గాంభీర్య విహారిణిన్ నిఖిల సంత్కారిణిన్ సాధు బాం
సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్.
          రుక్మిణీదేవి ఆత్మోన్నత్యం, మహావైభవం, గాంభీర్యాలతో మెలగుతుంది. సకల సంపదలు కలిగిస్తుంది. సాధువులను బంధువులను చక్కగ సత్కరిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తుంది, మహాదరిద్రాన్ని పోగొడు తుంది. చక్కటి భూషణాలు వస్త్రాలు ధరించిన, అలాంటి సుగుణాల నారీ శిరోమణి, తన మనోహారి యైన రుక్మణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు. శాశ్వతమైన యశస్సు పొందాడు.
105- ma.
dhruvakeertin hari peMDliyaaDe nija chEtOhaariNin maana vai
bhava gaaMbheerya vihaariNin nikhila saMpatkaariNin saadhu baaM
dhava satkaariNiM~ buNyachaariNi mahaadaaridrya saMhaari Nin
suvibhooShaaMbara dhaariNin guNavateechooDaamaNin rukmiNin.
          ధ్రువ = శాశ్వతమైన; కీర్తిన్ = కీర్తితో; హరి = కృష్ణుడు; పెండ్లి = వివాహము; ఆడెన్ = చేసుకొనెను; నిజ = తన యొక్క; చేతః = మనసును; హారిణిన్ = అపహరించినామెను; మాన = చిత్తౌన్నత్యము; వైభవ = ఐశ్వర్యము; గాంభీర్య = నిబ్బరములు కలిగి; విహారిణిన్ = విహరించెడి ఆమెను; నిఖిల = సర్వ; సంపత్ = సంపదలను; కారిణిన్ = కలిగించెడి ఆమెను; సాధు = మంచివారిని; బాంధవ = బంధువులను; సత్కారిణిన్ = సత్కరించునామెను; పుణ్య = మంచి; చారిణిన్ = నడవడిక కలామెను; మహా = గొప్ప; దారిద్ర్య = పేదరికములను; సంహారిణిన్ = నశింపజేయు నామెను; సు = మంచి; విభూషా = ఆభరణములను; ధారిణిన్ = ధరించు నామెను; గుణవతీ = సుగుణవంతురాలలో; చూడామణిన్ = శ్రేష్ఠురాలును; రుక్మిణిన్ = రుక్మిణీదేవిని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: