106-
క.
సతులుం
దారును బౌరులు
హితమతిఁ
గానుకలు దెచ్చి యిచ్చిరి
కరుణో
న్నత వర్ధిష్ణులకును
మా
నిత రోచిష్ణులకు
రుక్మిణీకృష్ణులకును.
అపార కృపా వర్ధిష్ణులు, అఖండ
తేజో విరాజితులు రుక్మిణీ శ్రీకృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో వచ్చి
మనస్పూర్తిగా కానుకలు తెచ్చి ఇచ్చారు.
106- ka.
satuluM daarunu baurulu
hitamatiM~ gaanukalu dechchi yichchiri karuNO
nnata vardhiShNulakunu maa
nita rOchiShNulaku rukmiNeekRiShNulakunu.
సతులున్ = భార్యలు; తారునున్ = తాముకలిసి; పౌరులు = పురజనులు; హితమతిన్ = ఇష్టపూర్వకముగా; కానుకలున్ = బహుమతులు; తెచ్చి = తీసుకొచ్చి; ఇచ్చిరి = ఇచ్చిరి; కరుణ = దయచేత; ఉన్నత = గొప్ప వహించిన; వర్ధిష్ణుల్ = వృద్ధి పొందు గుణము కల వారి; కును = కు; మానిత = మన్నింపదగిన; రోచిష్ణుల = ప్రకాశవంత స్వభావము గల వారి; కున్ = కి; రుక్మిణీ = రుక్మిణీదేవి; కృష్ణుల = కృష్ణుడుల; కును = కు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment