Sunday, January 4, 2015

రుక్మిణీకల్యాణం – మగిడిచలించి

79- చ.
గిడి చలించి పాఱుచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో
చుచు నాలిఁ గోల్పడినవాని క్రియం గడు వెచ్చ నూర్చుచున్
మొమునఁ దప్పిదేరఁ దమ ముందఱఁ బొక్కుచు నున్న చైద్యుతోఁ
తుర చేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్న వాఁడవే.
          కష్ణుని యాదవసేనచేతిలో ఓడి, వెనుదిరిగి పారిపోతున్న జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిసారు. పెళ్ళం పోయిన వాడిలా ఏడుస్తూ వేడి నిట్టూర్పులు నిట్టూరుస్తూ వడలిన ముఖంతో తమ ఎదురుగా వెక్కుతున్న శశిపాలుడిని చూచారు. పోన్లే. శత్రువు చేతిలో చావకుండా బతికే ఉన్నావు కదా అని ఓదార్చేరు.
79- cha.
magiDi chaliMchi paaRruchunu maagadha mukhyulu gooDi yokkachO
vagachuchu naaliM~ gOlpaDinavaani kriyaM gaDu vechcha noorchuchun
mogamunaM~ dappidEraM~ dama muMdaRraM~ bokkuchu nunna chaidyutOM~
bagatura chEtilOM~ baDaka praaNamutODuta nunna vaaM~DavE.
          మగిడి = వెనుదిరిగి; చలించి = బెదిరిపోయి; పాఱుచును = పారిపోవుచు; మాగధ = జరాసంధుడు; ముఖ్యులున్ = మున్నగువారిని; కూడి = కలిసి; ఒక్క = ఒక; చోన్ = చోట; వగచుచున్ = దుఃఖించుచు; ఆలిన్ = భార్యను; కోల్పడిన = పోగొట్టుకున్న; వాని = వాడి; క్రియన్ = వలె; కడున్ = మిక్కలి; వెచ్చనూర్చుచున్ = వేడినిట్టూర్పులు విడుస్తు; మొగమునన్ = ముఖముమీద; దప్పిదేరన్ = శ్రమముకనబడుతుండ; తమ = వారి; ముందఱన్ = ఎదురుగా; బొక్కుచున్న = తపించుచున్న; చైద్యున్ = శిశుపాలుని; తోన్ = తోటి; పగతుర = శత్రువుల; చేతిన్ = చేతికి; లోబడకన్ = చిక్కకుండ; ప్రాణము = ప్రాణాల; తోడుతన్ = తోటి; ఉన్నవాడవే = ఉన్నావా.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: