102-
వ.
ఇట్లు
బలభద్రునిఁచేతఁ దెలుపంబడి రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె; నట రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుం డై, విడువంబడి తన
విరూపభావంబు నకు నెరియుచు హరిం గెలిచి కాని కుండినపురంబు చొరనని ప్రతిఙ్ఞచేసి,
తత్సమీపంబున నుండె నివ్విధంబున.
ఇలా బలరామునిచేత ప్రభోధింపబడి,
రుక్మిణి దుఃఖము విడిచిపెట్టింది. అక్కడ రుక్మి ప్రాణాలతో విడువబడి, అవమానంతో తన
వికృత రూపానికి చింతిస్తూ “కృష్ణుని గెలచి కాని కుండినపురం ప్రవేశించ” నని ప్రతిఙ్ఞ చేసి, పట్టణం బయటే ఉన్నాడు.
ఇట్లు = ఈ విధముగ; బలభద్రుని = బలరాముని; చేతన్ = చేత; తెలుపంబడి = ఙ్ఞానముకలుగజేయబడి; రుక్మిణీదేవి = రుక్మిణి; దుఃఖంబున్ = దుఃఖమును; మాని = విడిచి; ఉండెన్ = ఉండెను; అట = అక్కడ; రుక్మి = రుక్మి; అనువాడు = అనెడివాడు; ప్రాణ = ప్రాణములు మాత్రము; అవశిష్టుండు = మిగిలినవాడు; ఐ = అయ్యి; విడువంబడి = బంధవిముక్తుడై; తన = అతని; విరూపభావంబున్ = రూపవికారత్వమున; కున్ = కు; ఎరియుచున్ = తపించుచు; హరిన్ = కృష్ణుని; గెలిచి = జయించి; కాని = కాని; కుండినపురంబున్ = కుండిననగరమును; చొరను = ప్రవేశించను; అని = అని; ప్రతిజ్ఞ = శపధము; చేసి = చేసి; తత్ = దాని; సమీపంబునన్ = దగ్గరలో; ఉండెన్ = ఉండెను; ఇవ్విధంబునన్ = ఈ విధముగ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment