75- క.
అరిబల
భట సాయకముల
హరిబలములు
గప్పఁబడిన నడరెడు భీతిన్
హరిమధ్య
సిగ్గుతోడను
హరివదనముఁ
జూచెఁ జకితహరిణేక్షణయై.
ప్రతిపక్ష సైన్యాల బాణాలు
కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి, సుకుమారి రుక్మిణీదేవి బెదిరిన లేడి
చూపులతోను భయంతోను సిగ్గుతోను ముకుందుని కృష్ణుని ముఖంకేసి చూసింది.
75- ka.
aribala bhaTa saayakamula
haribalamulu gappaM~baDina naDareDu bheetin
harimadhya siggutODanu
harivadanamuM~ joocheM~ jakitahariNEkShaNayai.
అరి = శత్రువుల; బల = సైన్యములోని; భట = సైనికుల; సాయకములన్ = బాణములచేత; హరి = కృష్ణుని; బలములున్ = సైన్యములు; కప్పబడినన్ = ఆవరింపబడగా; అడరెడు = అతిశయించెడి; భీతిన్ = భయముతో; హరిమధ్య = సుందరి {హరిమధ్య - సింహము వంటి నడుము కలామె,
స్త్రీ}; సిగ్గు = సిగ్గు; తోడను = తోటి; హరి = కృష్ణుని; వదనమున్ = ముఖమును; చూచెన్ = చూసెను; చకిత = బెదరిన; హరిణ = లేడి వంటి; ఈక్షణ = చూపులు కలామె; ఐ = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment