91- మ.
అని
డగ్గుతికతో మహాభయముతో నాకంపితాంగంబుతో
వినత
శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీకలాపంబుతోఁ
గనుదోయిన్
జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు
మ్రొ
క్కిన
రుక్మిం దెగవ్రేయఁబోక మగిడెం గృష్ణుండు
రోచిష్ణుఁడై.
ఇలా అన్నను విడిచిపెట్టమని
వేడుకుంటున్న రుక్మిణి గద్గదస్వరంతో మిక్కలి భయ కంపితురాలై వేడుకొంది. అప్పుడు ఆమె
దేహం వణుకుతోంది. వంచిన వదనం వడలింది. చెవుల మీదకి శిరోజాలు వాలాయి. కన్నీటి జడికి
గుండెలు తడిసాయి. అంతట కృష్ణుడు రుక్మిని చంపక వెనుదిరిగేడు.
91- ma.
ani DaggutikatO mahaabhayamutO naakaMpitaaMgaMbutO
vinata shraaMta mukhaMbutO shrutichaladvENeekalaapaMbutOM~
ganudOyin jaDigonna baaShpamulatOM~ ganyaalalaamaMbu mro
kkina rukmiM degavrEyaM~bOka magiDeM gRiShNuMDu rOchiShNuM~Dai.
అని = అని; డగ్గుతిక = బొంగురుగొంతుక; తోన్ = తోటి; మహా = మిక్కిలి; భయము = భయము; తోన్ = తోటి; ఆకంపిత = మిక్కిలి వణుకుతున్న; అంగంబు = శరీరము; తోన్ = తోటి; వినత = వంచిన; శ్రాంత = బడలిన; ముఖంబు = మఖము; తోన్ = తోటి; శ్రుతిన్ = చెవిమీద; చలత్ = చలించుతున్న; వేణీ = జడ, జడపాయ అను; కలాపంబు = అలంకారము; తోన్ = తోటి; కను = కళ్ళ; దోయిన్ = జంటనుండి; జడిగొన్న = ధారగాకారుతున్న; బాష్పముల్ = కన్నీటి; తోన్ = తోటి; మ్రొక్కినిన్ = నమస్కరించగా; రుక్మిన్ = రుక్మిణిని; తెగవ్రేయబోక = నరకబోవుట; మగిడెన్ = మానెను; కృష్ణుండు = కృష్ణుడు; రోచిష్ణుడు = ప్రకాశము కలవాడు; ఐ = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment