95- వ.
అని
వితర్కించి పలికి రుక్మిణీదేవి నుపలక్షించి యిట్లనియె.
96- శా.
తోడంబుట్టినవాని
భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె
గ్గాడం
జూడకు మమ్మ పూర్వభవక ర్మాధీనమై
ప్రాణులం
గీడున్ మేలునుజెందు; లేఁ డొకఁడు శిక్షింపంగ
రక్షింప నీ
తోడంబుట్టువు
కర్మశేష పరిభూతుం డయ్యె నే డీ యెడన్.
ఇలా కృష్ణుని విమర్శించిన
బలరాముడు, రుక్మిణితో ఇలా అన్నాడు
“అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు. మా కృష్ణుడిని నిందించబోకు
తల్లీ! పూర్వజన్మలలోని కర్మానుసారం జీవులకు మంచిచెడులు సంభవిస్తాయి. శిక్షించడానికి
కాని రక్షించడానికి కాని కర్త ఎవరు లేరు. నీ అన్న అనుభవించ వలసిన శేష కర్మఫలం వలన
ఇప్పుడు ఈ పరాభవం పొందాడు.
95- va.
ani vitarkiMchi paliki rukmiNeedEvi nupalakShiMchi yiTlaniye.
96- shaa.
tODaMbuTTinavaani bhaMgamunakun du:khiMchi maa kRiShNu ne
ggaaDaM jooDaku mamma poorvabhavakarmaadheenamai praaNulaM
geeDun mElunujeMdu; lEM~ DokaM~Du shikShiMpaMga rakShiMpa nee
tODaMbuTTuvu karmashESha paribhootuM Dayye nE Dee yeDan.
అని = అని; వితర్కించి = ఆక్షేపించి; పలికి = చెప్పి; రుక్మిణీదేవిన్ = రుక్మిణిని; ఉపలక్షించి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
తోడంబుట్టినవానిన్ = సోదరుని; భంగమున్ = అవమానమున; కున్ = కు; దుఃఖించి = విచారించి; మా = మా యొక్క; కృష్ణున్ = కృష్ణుని; ఎగ్గాడన్ = నిందింప; చూడకుము = భావింపకుము; అమ్మ = తల్లీ; పూర్వ = మునుపటి; భవ = జన్మములందు జేసిన; కర్మ = కర్మములకు; అధీనము = అనుసరించునది; ఐ = అయ్యి; ప్రాణులన్ = జీవులకు; కీడున్ = ఆపద; మేలున్ = మంచి; చెందున్ = కలుగును; లేడు = లేడు; ఒకడు = వేరొకడు; శిక్షింపంగన్ = శిక్షించుటకు; రక్షింపన్ = కాపాడుటకు; నీ = నీ యొక్క; తోడంబుట్టువు = అన్న; కర్మ = పూర్వజన్మ కర్మఫలముల; శేష = వాసన (అనుభవించగా మిగిలినదానిచేత); పరిభూతుండు = అవమానింపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; నేడు = ఇవాళ; ఈ = ఈ యొక్క; ఎడన్ = చోటునందు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment