97- క.
చంపెడి
దోషము గలిగినఁ
జంపఁ
జనదు బంధుజనులఁ జను
విడువంగాఁ
జంపిన
దోషము సిద్ధము
చంపఁగ
మఱి యేల మున్న చచ్చిన వానిన్.
చంపదగ్గ తప్పు చేసినా సరే
బంధువులను చంపరాదు. వదిలెయ్యాలి. అలాకాక చంపితే పాపం, తప్పదు. అసలే అవమాన భారంతో
ముందే చచ్చినవాడిని వేరే చంపటం దేనికి. అంటు బలరాముడు రుక్మి దీనావస్థకి చింతిస్తున్న రుక్మిణితో చెప్పసాగాడు
97- ka.
chaMpeDi dOShamu galiginaM~
jaMpaM~ janadu baMdhujanulaM~ janu viDuvaMgaaM~
jaMpina dOShamu siddhamu
chaMpaM~ga maRri yEla munna chachchina vaanin.
చంపెడి = చంపదగిన; దోషము = తప్పు; కలిగినన్ = జరిగినను; చంపన్ = చంపివేయుట; చనదు = ధర్మముకాదు; బంధు = బంధువులైన; జనులన్ = వారిని; చనున్ = తగినపని; విడువంగాన్ = విడిచిపెట్టుట; చంపినన్ = చంపవేసినచో; దోషము = పాపము; సిద్ధము = తప్పకుండా కలుగును; చంపగన్ = చంపుట; మఱి = ఇంకా; ఏలన్ = ఎందుకు; మున్ను = ముందుగనే; చచ్చిన = చచ్చిపోయిన; వానిన్ = వాడిని.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
:
No comments:
Post a Comment