83- మ.
తమకుం
గాలము మంచిదైన మనలం ద్రైలోక్య
విఖ్యాతి వి
క్రములన్ గెల్చిరి
యాదవుల్ హరి భుజా గర్వం
బునన్ నేడు; కా
లము
మేలై చనుదెంచెనేని మనమున్ లక్షించి
విద్వేషులన్
సమరక్షోణి
జయింత; మింతపనికై శంకింప
నీకేటి కిన్.
ఇవాళ వారికి కాలం
అనుకూలమైంది. ముల్లోకాలలో ప్రసిద్దికెక్కిన మనల్ని కృష్ణుడి అండతో యాదవులు
జయించారు. కాలం కలిసొస్తే మనం కూడ పగవారిని యుద్దం లో పడగొడతాం. ఇంతోటి దానికి
విచారించడం ఎందుకు.”
83- ma.
tamakuM gaalamu maMchidaina manalaM drailOkya vikhyaati vi
kramulan gelchiri yaadavul hari bhujaa garvaM bunan nEDu; kaa
lamu mElai chanudeMchenEni manamun lakShiMchi vidvEShulan
samarakShONi jayiMta; miMtapanikai shaMkiMpa neekETi kin.
తమ = వారి; కున్ = కి; కాలము = కాలము; మంచిది = అనుకూలమైనది; ఐన = కాగా; మనలన్ = మనలను; త్రైలోక్య = ముల్లోకములకు; విఖ్యాతి = ప్రసిద్ధిచెందిన; విక్రములన్ = పరాక్రమము కలవారిని; గెల్చిరి = జయించిరి; యాదవుల్ = యదువంశమువారు; హరి = కృష్ణుని; భుజా = భుజబలము యొక్క; గర్వంబునన్ = అతిశయముచేత; నేడు = ఇవాళ; కాలము = కాలము; మేలు = మనకి అనుకూలము; ఐ = అయ్యి; చనుదెంచినేని = వచ్చినచో; మనమున్ = మనముకూడ; లక్షించి = గురిపెట్టి; విద్వేషులన్ = శత్రువులను; సమరక్షోణిన్ = యుద్ధభూమిలో; జయింతము = గెలుతుము; ఇంత = ఇంతమాత్రపు; పని = విషయము; కై = కోసము; శంకింపన్ = సంకోచపడుట; నీవు = నీ; కున్ = కు; ఏటికిన్ = ఎందుకు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :
No comments:
Post a Comment