మేరువుదలకిందైనను
8-595-క.
మేరువు దలక్రిందైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్.
మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు,
సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడిపొడి అయితే కావచ్చు,
ఆకాశం బద్దలు అయితే కావచ్చు. కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను.
ఈ దానం ప్రమాదకరం అందుచేత అబద్దమాడినా ఏం పరవాలేదు
వామనునికి దానం ఇయ్య వద్దని దానవకులాచార్యుడు శుక్రనీతి చెప్తుంటే, మహా దానశీలుడు
బలిచక్రవర్తి అంగీకరించకుండా ఈ దానం ఇచ్చి తీరతాను అబద్ధం ఆడను అంటు ఇలా
చెప్తున్నాడు.
8-595-ka.
maeruvu
dalakriMdainanu
baaraavaaraMbu
liMka@M baaRina lOlO
dhaaruNi
rajamai pOyina@M
daaraadhvamu
baddhamaina@M dappaka yittun.
మేరువు = మేరుపర్వతము; తలక్రింద = తిరగబడుట; ఐనన్ = జరిగినా సరే; పారావారంబులు = సముద్రములు; ఇంకబాఱినన్ = ఇంకిపోయినసరే; లోలోన్ = లోపల లోపలే; ధారుణి = భూమండలము; రజము = పొడి; ఐపోయినన్ = అయిపోయిన సరే; తారాధ్వము = ఆకాశము {తారాధ్వము -
తార (నక్షత్రపు) అధ్వము (దారి), ఆకాశము}; బద్ధమైనన్ = బద్ద లైపోయిన సరే; తప్పక = తప్పకుండ; ఇత్తున్ = ఇచ్చెదను.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment