Wednesday, June 11, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 313

భూషణములు


10.1-1685-క.
భూణములు చెవులకు బుధ
తోణము లనేక జన్మదురితౌఘ విని
శ్శోణములు మంగళతర
ఘోణములు గరుడగమను గుణభాషణముల్.
          గరుడనాహనుని గుణగణాలు వర్ణించే సంభాషణలు చెవులకు భూషణాలు, పండితులకు సంతోషాన్ని సమకూర్చేవి, ఎన్నెన్నో జన్మల నుండి సంచిత మౌతున్న సమస్త పాపాలను పరిపూర్తిగా తొలగించేవి, బహు మంగళకరము లైన నాదము లివి.
పరీక్షిన్మహారాజు అతి పవిత్రమైన ఆ రుక్మిణీకళ్యాణ ఘట్టం వినిపించమని శుకబ్రహ్మకు విన్నవిస్తూ హరికథల మహత్వం స్మరిస్తునాడు.
10.1-1685-ka.
bhooshaNamulu chevulaku budha
tOshaNamu lanaeka janmaduritaugha vini
SSOshaNamulu maMgaLatara
ghOshaNamulu garuDagamanu guNabhaashaNamul.
          భూషణములు = అలంకారములు; చెవుల్ = శ్రవణేంద్రియముల; కున్ = కు; బుధ = ఙ్ఞానులకు; తోషణముల్ = సంతోషము నిచ్చునవి; అనేక = పెక్కు; జన్మ = జన్మలకు చెందిన; దురిత = పాపముల; ఓఘ = సమూహములను; వినిశ్శోషణములు = మిక్కలి ఆవిరి జేయునవి; మంగళతర = మిక్కిలి శుభకర మైన; ఘోషణములు = నాదములు; గరుడగమను = విష్ణుమూర్తి యొక్క; గుణ = దివ్యగుణములు; భాషణముల్ = తెలిపెడి మాటలు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: