ఓయమ్మ నీకుమారుడు
10.1-329-క.
ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ!
ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు
మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని.
సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం
ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు.
ఆ కపట శైశవమూర్తి కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను గోపికలు ఓపికలు
లేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.
10.1-329-ka.
O
yamma! nee kumaaru@MDu
maa
yiMDlanu baalu perugu mananee Dammaa!
pOyeda
mekkaDi kainanu
maa
yannala surabhulaana maMjulavaaNee!
ఓ = ఓహో; అమ్మ = తల్లి; నీ = నీ యొక్క; కుమారుడు = పుత్రుడు; మా = మా యొక్క; ఇండ్లను = నివాసములలో; పాలున్ = పాలు; పెరుగున్ = పెరుగు; మననీడు = బతకనీయడు; అమ్మా = తల్లీ; పోయెదము = పోతాము; ఎక్కడి కైనను = మంరికొక చోటునకు; మా = మా యొక్క; అన్నల = తండ్రుల యొక్క; సురభులు = గోవులమీద; ఆన = ఒట్టు; మంజులవాణీ = సుందరీ {మంజులవాణి - మృదువుగా మాటలాడెడి యామె, స్త్రీ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment