కదలంబాఱవు
8-244-మ.
కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజ
జూటా చంద్రుఁడుం గందఁడున్;
వదనాంభోజము వాడ; దా
విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో
మ్రింగుచోన్.
పరమశివుడు ప్రచండమైన హాలాహలాన్ని
ఆహ్వానించి నప్పుడు, దగ్గరకి వెళ్ళి నప్పుడు, కలిపి ముద్ద చేసేటప్పుడు, నోటిలో
పెట్టుకోనే టప్పుడు, తినేటప్పుడు, మింగే టప్పుడు, ఆయన దేహంపై అలంకారాలై ఉన్న
సర్పహారాలు చలించలేదు, శరీరం చమటలు కక్క లేదు, కళ్ళు ఎర్రబారటం కూడ జరగలేదు, తలమీది
తెల్లని చంద్రుడూ కందలేదు, వదనకమలమూ కమిలిపోలేదు.
సాగరమథన సమయంలో హాలాహలం పుట్టింది. ఆ విషాగ్ని తీవ్రత
సర్వలోక భీకరంగా ఉంది. దేవతలు శంకరుని శరణు వేడారు. కరుణించి భక్షించాడు. అలా ఆయన
హాలాహల భక్షణం చేసిన ఘట్టంలోని వర్ణన ఇది.
8-244-ma.
kadalaM
baaRavu paa@Mpa paeru; loDalan gharmaaMbujaalaMbu pu
TTadu;
naetraMbulu neRRa gaavu; nija jooTaa chaMdru@MDuM gaMda@MDun;
vadanaaMbhOjamu
vaaDa; daa vishamu naahvaaniMchuchO DaayuchO@M
badiluMDai
kaDi jaeyuchO@M diguchuchO bhakshiMchuchO mriMguchOn.
కదలన్ = కదలి; పాఱవు = పోవు; పాప = పాముల; పేరుల్ = దండలు; ఒడలన్ = దేహము పైన; ఘర్మ = చెమట; అంబు = నీటిబిందువుల; జాలంబున్ = సమూహము కూడ; పుట్టదు = పుట్టుట లేదు; నేత్రంబులున్ = కన్ను లైనను; ఎఱ్రన్ = ఎర్రగా; కావు = కావు; నిజ = తన యొక్క; జూటా = జటముడి యందలి; చంద్రుడున్ = చంద్రుడు కూడ; కందడున్ = ఎర్రబారిపోడు; వదన = మోము యనెడి; అంభోజము = పద్మము; వాడదున్ = వాడిపోదు; ఆ = ఆ; విషమున్ = విషమును; ఆహ్వానించుచోన్ = స్వీకరించే టప్పుడు; డాయుచో = దగ్గరకు చేరే టప్పుడు; పదిలుండు = స్థిరుడు; ఐ = అయ్యి; కడిన్ = ముద్దగా; చేయు చోన్ = చేసే టప్పుడు; తిగుచు చోన్ = తీసుకొనే టప్పుడు; భక్షించుచోన్ = తినే టప్పుడు; మ్రింగుచోన్ = మింగే టప్పుడు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment