Sunday, June 8, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 311

కొందఱకు


1-20-క.
కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల య్యై యెడలన్.
          తెలుగు పదాలతో కూర్చి రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పద సంభూత రచనలను మరికొంతమంది నచ్చుకుంటారు. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను వీళ్ళు వాళ్ళు అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను.
భాగవతాన్ని ఆంధ్రీకరించే తన నిర్ణయం గురించి బమ్మెర పోతనామాత్యులు వివరిస్తు, అందరికి నచ్చేలా చెప్తా నంటున్న సాధికార ఆత్మాభిమానం ఎంతో చక్కగా ఉంది. పూర్ణానుస్వార పూర్వక కార ప్రాస ప్రయోగించి అందిర్ని అని నొక్కిచెప్పటం ధ్వనింపజేయటం బావుంది. ఆయన చక్కటి ప్రజాకవి అనటాని కిదో నిదర్శనం.
1-20-ka.
koMdaRaku@M denu@Mgu guNamagu@M
goMdaRakunu saMskRtaMbu guNamagu reMDuM
goMdaRiki guNamulagu nae
naMdaRa meppiMtu@M gRtula nayyai yeDalan.
          కొందఱు = కొంతమంది; కున్ = కి; తెనుఁగు = తెలుగు {తెనుగు గుణమగు – తెలుగు (దేశీయ) పదాల ప్రయోగం ఎక్కువుంటే నచ్చును}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; కొందఱకును = కొంతమందికి; సంస్కృతంబు = సంస్కృతము {సంస్కృతంబు గుణమగు – సంస్కృత మూల పదాల ప్రయోగం ఎక్కువుంటే నచ్చును}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; రెండున్ = రెండూ; కొందఱి = కొంతమంది; కిన్ = కి; గుణములు = బాగుగ ఉండుటలు; అగు = అగు; నేన్ = నేను; అందఱ = అందర్ని; మెప్పింతు = మెప్పిస్తాను; కృతులన్ = రచనలలో; ఆయ్యై = ఆయా; ఎడలన్ = సందర్భానుసారంగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: