కువలయరక్షాతత్పర
10.1-1790-క.
కువలయ రక్షాతత్పర!
కువలయదళ నీలవర్ణ కోమల దేహా!
కువలయనాథ శిరోమణి!
కువలయజనవినుత విమల గుణసంఘాతా!
భూమండలాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడా! కలువ రేకుల
వంటి నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా! భూమండలంలోని
భూపతు లందరికి శిరోభూషణ మైన వాడా! పుడమి మీదనుండే జనులందరిచే పొగడబడే సుగుణాల సమూహం కలవాడా! శ్రీ రామచంద్ర ప్రభో! నీకు వందనం.
ఇది దశమస్కంధ ప్రథమాశ్వాశాంత ప్రార్థనా పద్యం.
10.1-1790-ka.
kuvalaya
rakshaatatpara!
kuvalayadaLa
neelavarNa kOmala daehaa!
kuvalayanaatha
SirOmaNi!
kuvalayajanavinuta
vimala guNasaMghaataa!
కువలయ
రక్షా తత్పర = శ్రీరామా {కువలయ రక్షా తత్పరుడు
- కు (భూమి) వలయ (మండలమును) రక్షా (కాపాడుట యందు) తత్పరుడు (ఆసక్తి కలవాడు), శ్రీరాముడు}; కువలయ దళ నీలవర్ణ కోమల దేహా = శ్రీరామా {కువలయదళనీలవర్ణకోమలదేహుడు - కువలయ (నల్లకలువ) యొక్క దళ (రేకులవంటి) వర్ణ
(రంగు కలిగిన) కోమల (మృదువైన) దేహుడు (శరీరము కలవాడు), శ్రీరాముడు}; కువలయనాథ శిరోమణి = శ్రీరామా {కువలయనాథశిరోమణి - కు (భూమి) వలయ(మండలమును) నాథ (ఏలువారిలో) శిరోమణి
(తలమీది మణివలె శ్రేష్టమైన వాడు), శ్రీరాముడు}; కువలయ జన వినుత = శ్రీరామా {కువలయ జన వినుత - కువలయ (భూమండలము యొక్క) జన (సర్వ ప్రజల చేత) వినుత
(స్తుతింపబడువాడు), శ్రీరాముడ}; విమల గుణ సంఘాతా = శ్రీరామా {విమల గుణ సంఘాతుడు - విమల (స్వచ్ఛమైన) గుణ (సుగుణముల) సంఘాత (సమూహములు
కలవాడు), శ్రీరాముడు}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~
No comments:
Post a Comment