Tuesday, June 24, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 331

మానినీమన్మథు

10.1-1014-సీ.
మానినీమన్మథు మాధవుఁ గానరే
 లలితోదార వత్సకములార!

లలితోదారవత్సక వైరిఁ గానరే
 సుందరోన్నత లతార్జునములార!
సుందరోన్నతలతార్జునభంజుఁ గానరే
 నతర లస దశోకంబులార!
నతర లసదశోస్పూర్తిఁ గానరే
 వ్యరుచిర కాంచనంబులార!
ఆ.
వ్య రుచిర కాంచ కిరీటుఁ గానరే
హనపదవిఁ గురవకంబులార!
హనపదవి గురవ నివాసిఁ గానరే
ణికలార! చారు ణికలార!
          మనోహరములు, ఉన్నతములు యైన కొడిసె చెట్లులార! మానవంతులైన మహిళల మనసులను మథించే మన్మథుడైన లక్ష్మీపతిని చూసారా? చిక్కనైన లతలు అల్లుకున్న చక్కటి పొడవైన మద్ధివృక్షములార! మనోజ్ఞమైన రూపువాడు, ఉదారుడు, వత్సాసురుని వధించిన వాడు అయిన అచ్యుతుని కన్నారా? మిక్కిలి యెత్తైన చక్కటి అశోకతరువులార! చిక్కనైన లతలు అల్లుకున్న చక్కటి పొడవైన మద్ధివృక్షములను పడగొట్టిన పద్మాక్షుని పరికించారా? తాజాగా నున్న చక్కదనాల సంపెంగలలారా! దుఃఖరహితుడై వెలయుచున్న తోయజాక్షుని పరికించారా? ఎర్రగోరింటలార! ఈ వనమధ్యలో సరికొత్త బంగారు కిరీటము గల శౌరిని కాని కనుగొన్నారా? ఓ అందమైన అడవిమల్లెలలార! బృందావన మందలి ఎర్రగోరింట పొదలలో సంచరించే హరిని అవలోకించారా?
యమకాలంకారల అందం ఈ పద్యానికి ఎంతో అందాన్నిచ్చింది.
10.1-1014-see.
maanineemanmathu maadhavu@M gaanarae
 salalitOdaara vatsakamulaara!
salalitOdaaravatsaka vairi@M gaanarae
 suMdarOnnata lataarjunamulaara!
suMdarOnnatalataarjunabhaMju@M gaanarae
 ghanatara lasa daSOkaMbulaara!
ghanatara lasadaSOka spoorti@M gaanarae
 navyaruchira kaaMchanaMbulaara!
aa.
navya ruchira kaaMchana kireeTu@M gaanarae
gahanapadavi@M guravakaMbulaara!
gahanapadavi guravaka nivaasi@M gaanarae
gaNikalaara! chaaru gaNikalaara!
          మానినీ = స్త్రీలకు; మన్మథున్ = మోహముపుట్టించువాడు {మన్మథుడు - మనసును కలత పెట్టువాడు, రతీదేవి భర్త}; మాధవున్ = మాధవున్ {మా (లక్ష్మీదేవి) యొక్క భర్త}; సలలిత = మిక్కిలిమనోజ్ఞమైన; ఉదార = ఉన్నతమైన; వత్సకములారా = ఓ కొడిసె చెట్టులు; సలలిత = మిక్కలిమనోజ్ఞమైన; ఉదార = మనసుగల; వత్సక = వత్సకాసురునికి; వైరిన్ = శత్రును; కానరే = చూసితిరా; సుందర = అందమైన; ఉన్నత = ఎత్తైన; లతా = తీగలతోకూడియున్న; అర్జనములారా = ఓ మద్ధిచెట్లు; సుందర = అందమైన; ఉన్నత = ఎత్తైన; లత = లతలతోకూడియున్న; అర్జువ = మద్దిచెట్లను; భంజున్ = పడగొట్టినవానిని; కానరే = చూడలేదా; ఘనతర = మిక్కలి ఉన్నతమైనవి {ఘనము - ఘనతరము - ఘనతమము}; లసత్ = చక్కటి; అశోకంబులారా = అశోకవృక్షములు; ఘనతర = మిక్కిలి ప్రకాశవంతమైన {ఘనము - ఘనతరము - ఘనతమము}; లసత్ = ప్రకాశించునట్టి; అశోక = అధికానందమును; స్పూర్తిన్ = తోపించువాడైన; నవ్య = ఓ తాజా; రుచిర = కాంతులుగల; కాంచనంబులరా = సంపెంగ పూలు; నవ్య = సరికొత్త; రుచిర = కాంతివంతమైన; కాంచన = బంగారపు; కిరీటున్ = కిరీటము కలవానిని; కానరే = చూసితిరా; గహన = అడవి; పదవిన్ = మార్గమున; కురవకంబులారా = ఓ ఎర్రగోరింట చెట్లు; గహన = అడవి; పదవిన్ = ప్రదేశములందు; కురవక = ఎర్రగోరింట చెట్లకింద; నివాసిన్ = ఉండువానిని; కానరే = చూసితిరా; గణికలారా = అడవిమెల్లపూలు; చారు = ఓ అందమైన; గణికలారా = అడవిమెల్లలు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: